Advertisementt

పెళ్లయినా చైతూకి ఈ బాధతప్పడం లేదు!

Wed 08th Nov 2017 09:02 PM
akkineni naga chaitanya,samantha ruth prabhu,savyasachi,rangasthalam,naga chaitanya cooking  పెళ్లయినా చైతూకి ఈ బాధతప్పడం లేదు!
Naga Chaitanya Surprise Cooking for Samantha పెళ్లయినా చైతూకి ఈ బాధతప్పడం లేదు!
Advertisement
Ads by CJ

సాధారణంగా మనదేశంలో వంటలను ఆడవారు చేస్తారు. కానీ పురాణాల నుంచి నేటి రెస్టారెంట్స్‌, ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ వరకు 99శాతం మంది వంట చేసేది మగాళ్లే. అందుకే మన పూర్వీకులు 'నలభీమపాకం' అంటారు. ఇక విషయానికి వస్తే నాగచైతన్య - సమంతల పెళ్లయి అప్పుడే ఓ నెలైపోయింది. పెళ్లికిముందు కూడా నాగచైతన్య.. సమంతకు వంట చేసి పెట్టడం వంటి ఫొటోలను, వీడియోలను ఆమె సోషల్‌మీడియాలో పెట్టి అల్లరిచేస్తూ, తెగ హడావుడి చేసేది. 

ఇక తాజాగా సమంత కిచెన్‌లోకి వెళ్లి తన భర్త కోసం స్పెషల్‌ వంటకాలు చేసిన వీడియో బాగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం సమంత 'రంగస్థలం' షూటింగ్‌లో బిజీగా ఉంది. మరోవైపు నాగచైతన్య చందుమొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' చేస్తున్నాడు. దీని తర్వాత ఆయన మారుతి దర్శకత్వంలో చేసే సినిమా మొదలవుతుంది. ఇక దీంతో వీరిద్దరు తమ తమ సినిమాలలో బిజీగా ఉన్నప్పటికీ సాయంత్రం షూటింగ్‌ నుంచి వచ్చిన తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉంటూ మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నారు. తాజాగా వారి వివాహం జరిగి నెల అయిన సందర్భంగా నాగచైతన్య వన్‌ మంత్‌ సెలబ్రేషన్‌గా భావించి, సాయంత్రం సమంత 'రంగస్థలం' షూటింగ్‌ నుంచి ఇంటికి రాగానే నాగచైతన్య తానే తన భార్య కోసం ఆమెకి, తనకి నచ్చిన వంటలను చేసి సర్‌ప్రైజ్‌ చేశాడట. 

ఈ వీడియోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. అంతేకాదు.. సమంత ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా క్యాండిల్స్‌ వెలిగించి, ఆమెను ఆనందంలో ముంచెత్తాడట. ఈ విషయం తెలుపుతూ సమంత తన సంతోషం వ్యక్తం చేస్తూ ప్రపంచంలోనే అతి ఉత్తమమైన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని, ఈ జీవితం ఎంతో హ్యాపీగా ఉందని చెబుతుంది. దీనిపై పలువురు బెస్ట్‌ కపుల్స్‌ అని, అద్భుతమైన జంటగా కామెంట్స్‌ చేస్తుంటే... పెళ్లయిన తర్వాత కూడా నాగచైతన్యకి వంట తిప్పలు తప్పడం లేదని మరికొందరు జోక్‌ చేస్తున్నారు. అన్నట్లు వంటలో సమంత కంటే నాగచైతన్యనే బెస్ట్‌ అన్న విషయం తెలిసిందే.

Naga Chaitanya Surprise Cooking for Samantha :

Naga Chaitanya and Samantha One Month Wedding Celebrations

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ