నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా కరెక్ట్ గా ఉదయం 10 గంటలకు ఆయన డైరెక్ట్ చేస్తున్న అజ్ఞాతవాసి (ఇంకా ఫిక్స్ చేయలేదు) సినిమాలో నుంచి ఓ సాంగ్ ని విడుదల చేశారు చిత్ర యూనిట్. 'బయటకొచ్చి చూస్తే' అనే లిరిక్స్ తో సాగే ఈసాంగ్ ఇలా విడుదలైన వెంటనే అలా సూపర్ హిట్ అయింది.
అయితే ఈ సాంగ్ ను తమిళ మ్యూజిక్ డైరెక్టర్... అజ్ఞాతవాసి సంగీత దర్శకుడు అనిరుధ్ కంపోజ్ చేశాడు. ఈ పాటకు 7 గంటల్లో 6 లక్షల 90వేల వ్యూస్ వచ్చాయి. అంటే సగటున గంటలకు లక్ష వ్యూస్ అన్నమాట. ఇదే ఊపులో ఈ పాట ఈ రోజు సాయంత్రానికి 20లక్షల వ్యూస్ క్రాస్ చేయడం గ్యారెంటీ. అలా విడుదలైన ఈ సాంగ్ ప్రస్తుతం బ్లాక్ బస్టర్ లిస్ట్ లో చేరిపోయింది. అయితే ఈ పాటలో ఎక్కువగా అంటే... 37 ఇంగ్లీష్ పదాలు వాడారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పాట చర్చనీయాంశం అయింది. ఈ పాటలో ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వున్నాయి అని..గతంలో త్రివిక్రమ్ సినిమాలో ఇలా ఎక్కువగా ఇంగ్లిష్ పదాలు వాడిన పాటల్ని కూడా బయటకు తీస్తున్నారు నెటిజన్లు.
అయితే పాట రాసింది త్రివిక్రమ్ కాకపోయినా.... రాయించింది త్రివిక్రమ్ కదా అని వాపోతున్నారు. స్వచ్ఛమైన తెలుగు పదాలతో డైలాగ్స్ రాసే త్రివిక్రమ్, ఇలా పాటల్లో ఇంగ్లీష్ ను ఎంకరేజ్ చేయడం ఏం బాగాలేదంటున్నారు కొంతమంది జనాలు. ఏదిఏమైనా ఈ పాట యూత్ కి మాంచి కిక్ ఇస్తుంది. ఇకపోతే అజ్ఞాతవాసిలో కేవలం ఈ ఒక్క పాటను మాత్రమే ఇలా యూట్యూబ్ లో విడుదల చేసిన చిత్ర బృందం... మిగతా పాటలను మాత్రం ఒక గ్రాండ్ ఆడియో వేడుక ద్వారా విడుదల చేయాలని.... దీనికి హరిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు కూడా గట్టిగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ అజ్ఞాతవాసి ఆడియో వేడుకని డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట.