ఎన్టీఆర్ చాలా సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ తో ఆడి పాడాడు. బృందావనం, రభస, జనతా గ్యారేజ్ వంటి చిత్రాలలో ఇద్దరు హీరోయిన్స్ తో జోడి కట్టాడు ఎన్టీఆర్. మరోపక్క దర్శకుడు త్రివిక్రమ్ కూడా తాను డైరెక్ట్ చేసే సినిమాలలో ఎక్కువగా ఇద్దరు హీరోయిన్స్ కి ప్రయారిటీ ఇస్తున్నాడు. జల్సా, అత్తారింటికి దారేది. ఇప్పుడు పవన్ తో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం అజ్ఞాతవాసిలో కూడా ఇద్దరు హీరోయిన్స్ నే పెట్టుకున్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో తెరకెక్కబోతున్న సినిమాలోనూ ఇద్దరు హీరోయిన్స్ ఉంటారనే న్యూస్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.
కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఒక హీరోయిన్ గా అను ఎమ్మాన్యుయేల్ ను ఎంపిక చెయ్యగా... మరొక హీరోయిన్ గా డీజే భామ పూజ హెగ్డేని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా కోసం త్రివిక్రమ్ ఏదో డిటెక్టీవ్ నవల హక్కులు కొన్నాడని... ఈ సినిమాలో ఎన్టీఆర్ డిటెక్టీవ్ గా కనబడతాడనే ప్రచారం గత రెండు రోజులుగా జరుగుతుంది. అయితే అవన్నీ గాలి వార్తలే అని.... త్రివిక్రమ్ - ఎన్టీఆర్ ల సినిమా మొత్తం త్రివిక్రమ్ మాటలందించిన నువ్వునాకు నచ్చావ్ సినిమాలాగే కుటుంబ కథా చిత్రంగా ఉంటుందంటున్నారు.
మరి ఈ చిత్రంలో ఎన్టీఆర్ బృందావనం సినిమాలోలా కచ్చితంగా కృష్ణుడి వేషాలు వేయడం ఖాయమంటున్నారు. ఇకపోతే హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి సమానమైన పాత్ర కోసం బాలీవుడ్ నటి టబుని సంప్రదిస్తున్నారనే టాక్ వుంది.