Advertisementt

బాలయ్య సెన్సేషనల్ డెసిషన్..!

Tue 07th Nov 2017 06:23 PM
sv krishna reddy,balakrishna,top hero,ntr biopic,balayya movie  బాలయ్య సెన్సేషనల్ డెసిషన్..!
Balakrishna Movie in SV Krishna Reddy Direction బాలయ్య సెన్సేషనల్ డెసిషన్..!
Advertisement
Ads by CJ

పూరి జగన్నాధ్ తో చేసిన 'పైసా వసూల్' ని రికార్డు టైంలో పూర్తి చేసి విడుదల చేసిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెఎస్. రవి కుమార్ దర్శకత్వం లో 'జై సింహ' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. ఈ సినిమా షూటింగ్ అయ్యాక బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ ని స్టార్ట్ చేయాలి అనుకున్నాడు. కానీ దర్శకుడు తేజ ఆ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చెయ్యని కారణంగా ఈ సినిమా మొదలవ్వడానికి కొంచెం టైం పడుతుంది.. కాబట్టి ఈ లోపు బాలకృష్ణ ఇంకో సినిమా చేయాలి అని ఫిక్స్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి.

ఆ సినిమా కూడా సీనియర్ దర్శకుడు అయిన ఎస్వీ కృష్ణారెడ్డితో కావడం విశేషం. కృష్ణారెడ్డి ప్రస్తుతం ఇండస్ట్రీలో అసలు ఫామ్ లో లేని దర్శకుడు. కానీ ఈ మధ్యన తరుచు బాలకృష్ణకు సంబంధించిన ఈవెంట్స్ లో మెరుస్తున్నాడు. అప్పుడే ఎస్ వి కృష్ణారెడ్డితో బాలయ్య సినిమా ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడో ఫిక్స్ అయ్యారు. అయితే రీసెంట్ గా కృష్ణారెడ్డి చెప్పిన ఒక స్టోరీ లైన్ నచ్చడంతో దాంతోనే సినిమా చేయాలని బాలయ్య భావిస్తున్నట్లుగా తెలుస్తుంది.  మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాలంటే బాలక్రిష్ణ లేదా కృష్ణారెడ్డి నుండి క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. 

ఇదిలా ఉంటే గతంలో బాలకృష్ణ - ఎస్ వి కృష్ణారెడ్డి కలయికలో వచ్చిన 'టాప్ హీరో' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నిజంగా కృష్ణారెడ్డితో సినిమా గనక పట్టాలెక్కితే మాత్రం, బాలయ్య కోసం ఎదురు చూస్తున్న మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి మళ్ళీ బాలయ్య బాబు హ్యాండ్ ఇచ్చినట్టే అవుతుంది. చూద్దాం ఫైనల్ గా ఏం జరుగుతుందో అనేది.

Balakrishna Movie in SV Krishna Reddy Direction:

Balakrishna Sensational Decision- Movie with SV Krishna Reddy

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ