Advertisementt

భాగమతి ఫస్ట్ లుక్: అనుష్క ప్రభువు!

Tue 07th Nov 2017 02:44 PM
bhaagamathie,anushka,first look,anushka birthday  భాగమతి ఫస్ట్ లుక్: అనుష్క ప్రభువు!
Bhaagamathie First Look Released భాగమతి ఫస్ట్ లుక్: అనుష్క ప్రభువు!
Advertisement
Ads by CJ

అరుంధతిలో అరుంధతి పాత్రలో.... బాహుబలిలో దేవసేన పాత్రలో... రుద్రమదేవిలో రుద్రమదేవి పాత్రలో రాణిహాసం ఉట్టిపడేలా కనిపించిన అనుష్క తాజా చిత్రం భాగమతి లో ఎలా కనబడుతుందో అనే క్యూరియాసిటీతో ఉన్నారు అభిమానులు. రెండేళ్ల నుండి దర్శకుడు అశోక్ చెక్కుతున్న భాగమతి సినిమాలో అనుష్క భాగమతి పాత్ర పోషించనుందనే న్యూస్ తప్ప ఈ సినిమాకి సంబందించిన మరే న్యూస్ లేదు మీడియాలో. కానీ ఇన్నాళ్లకు అనుష్క పుట్టినరోజు కానుకగా భాగమతి ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. 

ఈ భాగమతి లుక్ లో అనుష్క ఈ మధ్యన ఎన్నడూ కనబడని సన్నని లుక్ లో దర్శనమిచ్చింది. చాలా సన్నగా కనబడుతున్న ఈ భాగమతి లుక్ లో అనుష్క మాస్ తరహాలో ఒక చేతిలో సుత్తి మరో చేతిలో కత్తి గాటు గాయంతో  రఫ్ లుక్ లో కనబడి అందరిని ఆశ్చర్యపరిచింది. భాగమతి అంటే ఏదో యువరాణి పాత్రలా అనుష్క కనబడుతుంది అనుకుంటే.... ఇదేమిటి ఇలా వెరైటీ లుక్ లో అనుష్క కనబడింది అనుకుంటున్నారు అభిమానులు. మరి అనుష్క లుక్ యేసుక్రీస్తు కి సిలువ వేసినప్పుడు ఎలా ఉంటుందో అచ్చం అలాంటి లుక్ నే తలపిస్తుంది. అనుష్క నించున్న బ్యాగ్రౌండ్ లో యేసుక్రీస్తు కి సంబందించిన కొన్ని ఆధారాలు కూడా కనబడుతున్నాయి.

ఇక టోటల్ గా లుక్ మాత్రం సినిమాలో కొత్త విషయం చెప్పబోతున్నారు అనేట్లుగానే ఉంది. ఊహించని విధంగా ఈ లుక్ ఉండడంతో చుసిన వాళ్ళంతా షాక్ అవుతున్నారు. మరి ఈ సినిమాని అశోక్ ఎలా తెరకెక్కించి ఉంటాడో అనే ఆసక్తి వీడాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు.

Bhaagamathie First Look Released:

Anushka holding a hammer on one hand and a nail pierced into other hand is not only a fierce design but offered a deadly feeling like that of Jesus Christ’s crucifixion.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ