Advertisementt

ఇంట్రెస్టింగ్‌ టీజర్‌ ఆన్‌ ది వే: సమంత!

Tue 07th Nov 2017 11:46 AM
samantha,irumbu thirai,teaser,ps mithran  ఇంట్రెస్టింగ్‌ టీజర్‌ ఆన్‌ ది వే: సమంత!
Samantha Talks About Irumbu Thirai Teaser ఇంట్రెస్టింగ్‌ టీజర్‌ ఆన్‌ ది వే: సమంత!
Advertisement
Ads by CJ

సమంత నాగచైతన్యని వివాహం చేసుకుని తెలుగింటి కోడలిగా, ప్రముఖ ఫ్యామిలీ అయిన అక్కినేని ఇంట కోడలిగా అడుగుపెట్టడంతో ఆమెకి పెద్దరికం వచ్చేసిందనే చెప్పాలి. ఇకపై కూడా తాను నటిస్తానని, అయితే ఏ పాత్రలంటే అవి చేయనని, ఎంతో ప్రాముఖ్యం ఉన్న పాత్రలనే చేస్తానని కూడా చెప్పేసింది. సో.. అక్కినేని ఇంటి కోడలిగా ఆమె చేసే చిత్రాలు, ఆమె నటించబోయే పాత్రలపై ఎప్పుడు అందరి కళ్లు ఉంటాయి అని చెప్పవచ్చు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రేక్షకుల నుంచి విమర్శలు రావడం ఖాయం. ఇక ఈమె పెళ్లికి ముందే షూటింగ్‌ పూర్తి చేసిన నాగార్జున 'రాజుగారిగది 2'లో ఆమె పాత్రకు మంచి పేరొచ్చింది. 

సినిమా కూడా బాగానే విజయవంతం అయింది. ఇక ఆ తర్వాత విజయ్‌తో కలిసి నటించిన 'మెర్శల్‌' చిత్రం విడుదలై తమిళనాట సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఈ నెల 9వ తేదీన డబ్బింగ్‌ చేసుకుని 'అదిరింది'గా విడుదల కానుంది. ఈ చిత్రంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు, వైద్యులపై వేసిన సెటైర్లతో పాటు ఈ చిత్రం సక్సెస్‌లో సమంతది కూడా తెలుగులో కీరోల్‌ కానుంది. ఇక ఆమె పెళ్లికి ముందే ఒప్పుకున్న మూడు చిత్రాలు ప్రస్తుతం నడుస్తున్నాయి. సావిత్రి బయోపిక్‌గా రానున్న 'మహానటి'లో ఆమె పాత్ర షూటింగ్‌ పూర్తయిందని తెలుస్తోంది. 

ఇక రామ్‌చరణ్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో నటిస్తున్న 'రంగస్థలం 1985'తో పాటు తమిళంలో ఆమె విశాల్‌, అర్జున్‌ల కాంబినేషన్‌లో సమంత కీలకపాత్ర పోషిస్తున్న చిత్రంలో కూడా సమంత క్యారెక్టర్‌ షూటింగ్‌ పూర్తయిందని సమాచారం. పీఎస్‌ మిత్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'ఇరుంబుదురై'. ఇందులో విశాల్‌, అర్జున్‌లు నటిస్తున్నారు.. మరో వైపు సమంత ఉండటంతో ఇది కూడా తెలుగులో డబ్‌ కావడం ఖాయమనే చెప్పాలి. ఇక ఈమె తాజాగా దర్శకుడు మిత్రన్‌ మొబైల్‌లో ఈ చిత్రం ట్రైలర్‌ని ఆసక్తిగా చూసింది. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ మిత్రన్‌ ఫస్ట్‌ కట్‌ టీజర్‌ని చూశాను. ఇది ఎంతో థ్రిల్లింగ్‌గా, ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. 'టీజర్‌ అన్‌ది వే' అని కామెంట్‌ చేసింది. చై-సామ్‌లు లండన్‌లో హనీమూన్‌ పూర్తి అయిన తర్వాత సమంత ఈ చిత్రం షూటింగ్‌లోనే పాల్గొంది. ఈచిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. 

Samantha Talks About Irumbu Thirai Teaser:

Super and Interesting Teaser on The Way says Samantha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ