అతిచిన్న వయసులోనే హీరోయిన్‌గా నజ్రియా నజీమ్ మంచి పేరు తెచ్చుకుంది. అందం, అభినయం ఉండటం, మంచి మాటకారి కూడా కావడంతో ఆమె ఇండస్ట్రీలో టాప్‌హీరోయిన్‌గా మారుతుందని పలువురు భావించారు. నయనతార కూడా అప్పట్లో అదే స్టేట్‌మెంట్ ఇచ్చింది. అట్లీ దర్శకత్వంలో నయనతార నటించిన 'రాజు -రాణి' చిత్రంలో ఫ్లాష్‌బ్యాక్‌లో కనిపించే హీరోయిన్‌గా ఆమెకు తెలుగులో కూడా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత 'బెంగుళూరు డేస్'లో నటించింది. కానీ తన 18వ ఏటనే ఆమె బంగారు భవిష్యత్తును వదిలి, ఏ వయసు ముచ్చట ఆ వయసులో జరగాలని భావించి, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ని వివాహం చేసుకుంది. దాంతో ఆమె మూడేళ్ల పాటు పరిశ్రమకు దూరంగా సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయింది. అయినా కూడా మాట్లాడే నాలుక.. తిరిగే కాలు.. మేకప్ వేసుకునే ఆర్టిస్ట్‌లు ఊరకనే ఉండరనే సామెతగా ఆమె మరలా ఆ గ్యాప్‌కి కామా పెట్టి హీరోయిన్‌గా రీఎంట్రీ ఇస్తోంది.
మహిళా దర్శకురాలు అంజలి మీనన్ తీయబోయే చిత్రంలో ఓ ప్రధాన పాత్రను పోషించడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీనిని నజ్రియా నజీమ్ కూడా కన్‌ఫర్మ్ చేసింది. తనను 'బెంగుళూర్ డేస్' తర్వాత మరలా ఎప్పుడు నటిస్తారు? అని అందరూ అడుగుతున్నారని చెబుతూ.... వారికి నేనిచ్చే సమాధానం ఇదే. నేను బ్యాక్ ఇన్ యాక్షన్. ఈ చిత్రంలో పృథ్వీరాజ్, పార్వతి, నేను నటిస్తున్నాం.. అని క్లారిటీ ఇచ్చేసింది. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవడం అనేది మానేసి ఇప్పుడు వివాహం తర్వాత నటిస్తే అందునా దక్షిణాది ప్రేక్షకులు ఆదరిస్తారా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది!