Advertisementt

రాజశేఖర్‌కి ఆనందం లేకుండా చేసింది!

Mon 06th Nov 2017 09:34 PM
rajasekhar,daughter,shivani,car accident  రాజశేఖర్‌కి ఆనందం లేకుండా చేసింది!
Case Registered on Shivani Car Accident రాజశేఖర్‌కి ఆనందం లేకుండా చేసింది!
Advertisement
Ads by CJ

పదేళ్ల తర్వాత రాజశేఖర్‌ 'పీఎస్వీగరుడవేగ' చిత్రంతో ఫామ్‌లోకి వచ్చాడు. ఈ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్‌ టాక్‌ వస్తోంది. సినిమాకి మౌత్‌టాక్‌ పెరగడం, రివ్యూలు బాగారావడం, ఇక ఇందులో రాజశేఖర్‌లోని పాత నటుడి ఎనర్జీని చూసినట్లుగా ఉందని ప్రచారం సాగడంతో ఆయన ఎంతో ఆనందంగా ఉన్నాడు. కానీ ఈ విజయాన్ని ఆయన తల్లి కనులారా చూడకుండా మరణించడం, సినిమా విడుదలకు రెండు రోజుల ముందే జీవిత రాజశేఖర్‌ సోదరుడు, 'పీఎస్వీగరుడవేగ'కి ఆన్‌లైన్‌ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన మురళి మరణం వంటివి ఆ ఫ్యామిలీని బాధిస్తున్నాయి. 

మరోవైపు రాజశేఖర్‌ దంపతుల పెద్ద కుమార్తె, త్వరలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్న శివాని తాజాగా చేసిన యాక్సిడెంట్‌ కూడా రాజశేఖర్‌కి తలనొప్పిగా మారింది. తాజాగా ఈ యాక్సిడెంట్‌పై జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కూడా కేసు నమోదైంది. శివాని జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 73 నుంచి నవనిర్మాణనగర్‌ వైపు కారులో వెళ్తుండగా, అక్కడి స్పీడ్‌బ్రేకర్‌ విషయంలో కారు అదుపుతప్పి ఆగి ఉన్న మరో కారుని గుద్దింది. ఈ ఘటనలో ప్రాణహానిగానీ, దెబ్బలు గానీ లేకపోవడం అదృష్టం. 

కాగా ఈ కారు ఓ ప్రవేట్‌ సంస్థలో ఆపరేషనల్ మేనేజర్‌గా పనిచేసిన అశోక్‌కుమార్‌ది. ఈ కారును ఇటీవలే కొన్నానని, దాంతో తనకు 30లక్షల నష్టపరిహారం చెల్లించాలని బాధితులు రాజశేఖర్‌ దంపతులను కోరాడు. కానీ అంత పెద్ద మొత్తం ఇవ్వడానికి రాజశేఖర్‌ దంపతులు ఒప్పుకోకపోవడంతో ఇప్పుడు ఆయన పోలీస్‌ స్టేషన్‌ దాకా వెళ్లి ఫిర్యాదు చేశాడు. మరోవైపు శివానీకి డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇదే నిజమైతే ఈ కేసు రాజశేఖర్‌ ఫ్యామిలీకి మరో తలనొప్పిగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. 

Case Registered on Shivani Car Accident:

Rajasekhar Unhappy with Car Accidents

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ