Advertisementt

దీపికా పార్టీలో సెలబ్రిటీ కూతుళ్ళ హంగామా!

Mon 06th Nov 2017 04:54 PM
celebrity daughters,deepika padukone,sara ali khan,jhanvi kapoor,bollywood  దీపికా పార్టీలో సెలబ్రిటీ కూతుళ్ళ హంగామా!
Celebrity Daughters at Deepika Padukone Private Party దీపికా పార్టీలో సెలబ్రిటీ కూతుళ్ళ హంగామా!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో ఇప్పుడు ఏ హీరో కూతురు సినిమా అరంగేట్రం చేస్తుందో.. ఏ హీరోయిన్ కూతురు సినిమాల్లోకి వస్తుందో అనే దాని మీద పెద్ద చర్చే నడుస్తుంది. ఎందుకంటే సీనియర్ హీరో హీరోయిన్స్ కూతుళ్లు వయసుకు వచ్చి సినిమాల్లోకి రావడానికి రెడీ అయ్యారు. శ్రీదేవి కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అలాగే షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ లు ఇలా సినిమాల్లోకి ఎంట్రీ కోసం క్యూ కట్టేశారు. ఈ స్టార్ డాటర్స్ ఎక్కడికి వెళ్లినా మీడియా.. వాళ్ళని వెంటాడేస్తుంది. వీరు కూడా పార్టీలు, పబ్బులు, ఫంక్షన్స్ అంటూ ఎప్పటికప్పుడు మీడియాకి ఫోకస్ అవుతూనే ఉన్నారు. 

సోషల్ మీడియాలో ఈ స్టార్ డాటర్స్ గురించిన రచ్చ మాములుగా లేదు. వీరు రెస్టారెంట్ కి వెళ్ళినా సెన్సేషనే... అలాగే బ్యూటీ పార్లర్ కి వెళ్లినా సెన్సేషనే. అయితే ఈ స్టార్ డాటర్స్ అందరూ బాలీవుడ్ లో దీపికా పదుకొనె ఇచ్చిన ఒక గ్రాండ్ పార్టీకి హాజరయ్యారు. దీపికా పదుకొనె పద్మావతి సినిమాలో నటిస్తుంది. అందులో భాగంగా పద్మావతి ట్రైలర్ ని లాంచ్ చెయ్యగా.. దానికి విశేష ఆదరణ దక్కడంతో దీపికా పదుకొనె బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరికి ఒక గ్రాండ్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీలో శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.

వీళ్ళు బాలీవుడ్ బడా కింగ్ మేకర్ కరణ్ జోహార్ తో, అలాగే రణ్వీర్ సింగ్ లతో కలిసి సెల్ఫీలు దిగుతూ పార్టీలో నానా హంగామా చేశారు. ఇక ఈ పార్టీ అంతటా ఈ స్టార్ డాటర్స్ మీదే నడించిందనే టాక్ వుంది.

Celebrity Daughters at Deepika Padukone Private Party:

Sridevi Daughter and Sara Ali Khan at Deepika Padukone Padmavati Trailer Release Party

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ