చిరంజీవి 150 వ సినిమాకి చిరు కొడుకు రామ్ చరణ్ నిర్మాత అవతారమెత్తి.. ఖైదీ నెంబర్ 150 ని నిర్మించి లాభాలు మూటగట్టుకున్నాడు. అదే ఊపుతో బాహుబలి సినిమాలా తన తండ్రి 151వ సినిమా సై రా నరసింహారెడ్డిని దేశంలోని పలు భాషల్లో భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయ్యాడు రామ్ చరణ్. కమర్షియల్ చిత్రాలు చేసుకునే సురేందర్ రెడ్డిని ఉయ్యాలవాడ జీవిత చరిత్రతో సై రా సినిమా చెయ్యడానికి ఎంపిక చేసుకుని... 150 కోట్ల బడ్జెట్ పెట్టడానికి చరణ్ తోపాటు చిరు రెడీ అయ్యాడు. ఆ బడ్జెట్ కి సరిపడినంత ఆర్భాటంతో సినిమాని ఎనౌన్స్ చేసాడు రామ్ చరణ్. బాహుబలిని తలదన్నేలా ఈ సినిమాని తెరకేకించే ప్లాన్ లో నానా హంగామా చేశారు అంతా. అయితే సినిమా అనౌన్స్ చేసి నెలలు గడుస్తున్నా ఈసినిమా ఇంకా సెట్స్ మీదకెళ్ళలేదు.
కరెక్ట్ గా విషయం క్లారిటీ లేదుగాని ఇప్పుడు ఈ సినిమాకి 150 కోట్ల నుండి 200 కోట్ల వరకు బడ్జెట్ ఎక్కుతుందని.. అంత బడ్జెట్ రామ్ చరణ్ ఒక్కడే మొయ్యగలడా అనే మీమాంశలో చిత్ర బృందం కొట్టుమిట్టాడుతోందని.... ఒకవేళ అంత బడ్జెట్ పెట్టి సినిమా నాలుగు భాషల్లో తెరకెక్కించినా... అంత బిజినెస్ జరిగి పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా అనే అనుమానం మొదలైనదని.. అందుకే ఈ బడా ప్రాజెక్ట్ లో ఇంకొంతమంది బడా నిర్మాతలకు చోటివ్వాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ బయటికి వచ్చింది. బాలీవుడ్ లో బడా నిర్మాతలతోపాటు ఇక్కడ అల్లు అరవింద్ లాంటి నిర్మాతను కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగం చెయ్యడంతో... కాస్త పబ్లిసిటీ పరంగా కలిసిరావడంతోపాటే ప్రొడక్షన్ పరంగా కూడా కాస్త తేలిగ్గా వుంటుందనే ఆలోచనలో ఉన్నారట. మరి ఈ విషయంలోనే సైరా ప్రాజెక్ట్ ఇంతవరకు పట్టాలెక్కలేదనే టాక్ బయటికి వచ్చింది.
ఇక ఈ చిత్రంలో బడా స్టార్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ తోపాటు, విజయ్ సేతుపతి, కిచ్చ సుదీప్, నయనతార, జగపతి బాబు వంటి స్టార్స్ నటిస్తుండగా... రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు.