తెలుగులో మోటు సామెతలు చాలా ఉన్నాయి. 'చిత్తకార్తె కుక్కలా ప్రవర్తిస్తున్నావు.... ఎక్కడైనా బావే గానీ వంగతోట కాడ బావ కాదు.. గడ్డివాము దగ్గర కుక్కల సంగతి తెలుసా? తను తినదు.. ఇంకెవ్వరిని తినన్విదు' అనే సామెతలకు అర్ధాలు తెలియని వారు ఉండరు. ఇక విషయానికి వస్తే హాట్ యాంకర్, హాట్ నటిగా 'గుంటూరు టాకీస్' వంటి వెండితెరపైనే కాదు.. తాను చేసే.. కుటుంబ సమేతంగా చూసే బుల్లితెరపై కూడా హాట్‌గా కనిపించే భామ రేష్మి. ఇక 'గుంటూరు టాకీస్'లో ఆమె పాత్ర, అందులో విచ్చలవిడిగా చూపించిన అందాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, శృంగార దృశ్యాలు మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి నిజమే. అంత మాత్రాన ఆ చిత్రం ఏమీ గొప్పదై పోదు.
ఇక తాజాగా ఈమె ఈటీవీ ప్రభాకర్ తొలిసారిగా వెండితెరపై మెగాఫోన్ చేతబట్టి వి4 వంటి ప్రతిష్టాత్మక బేనర్‌లో చేసిన 'నెక్ట్స్‌నువ్వే' చిత్రం తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో ఆది హీరోగా నటించగా ఓ పాత్రలో రేష్మి కనిపించింది. ఇక ఈ చిత్రంలో 'నీకు గడ్డివాము దగ్గర కుక్క సంగతి తెలుసా? అది తినదు.. ఇంకెవ్వరినీ తిననివ్వదు' అనే డైలాగ్‌పై విమర్శల వర్షం కురుస్తోంది.
దీనిపై రేష్మి సందిస్తూ ఆ సీన్‌లో తాను చక్కగా చీర కట్టులోనే కనిపించాను కదా...! ట్రైలర్‌లో కేవలం సింపుల్ డైలాగ్‌లనే చూపించాం. అందులో అశ్లీలత ఏముంది? అని వితండ వాదం చేస్తోంది. వాటిని కూడా చూసే ఇష్టపడే ప్రేక్షకులు ఉన్నారు అని చెబితే కాస్తైనా నిజాయితీగా ఉండేది. కానీ ఈమె వాదన చూస్తే మరో మోటు సామెత గుర్తుకొస్తుంది. 'చేసేవి శివపూజలు.. దూరేవి దొమ్మర గుడిసెలు' అనే సామెత రేష్మికి కరెక్ట్‌గా సూటవుతుందనే చెప్పాలి...!