కమల్‌హాసన్‌ని అందరూ లోకనాయకుడు అంటారు. నటునిగా ఆయన గ్రేటెస్ట్ అనే చెప్పాలి. కానీ వ్యక్తిగత విషయాలలో, చీప్ పబ్లిసిటీలో మాత్రం ఆయనను ఎంత తిట్టినా తక్కువే. ఆయన తన పేరు కోసం ఒక్కోసారి ముస్లింలను టార్గెట్ చేస్తాడు. మరోసారి హిందువులపై దూషణ పర్వం సాగిస్తారు. ఏదేమైనా అంటే నాకు వాక్‌స్వాతంత్య్రం ఉంది. విదేశాలకు వెళ్లిపోతాను. ఇండియాలో స్వేచ్చ లేదు అంటాడు. ఇక 'విశ్వరూపం'లో ముస్లింల మీద విరుచుకుపడినా ఆయన అంతకు ముందు 'హేరామ్'లో గాంధీని తప్పుగా చూపించాడు. ఈ మద్య హిందువులు పవిత్రంగా భావించే భగవద్గీత, మహాభారతం, రామాయణం మీద పిచ్చి పిచ్చి కూతలు కూశాడు. వాక్‌స్వాతంత్య్రం అంటే ఇతరుల మనోభావాలను దెబ్బతీయకుండా మాట్లాడటమే గానీ విచ్చలవిడిగా మతాలు, కులాల మధ్య గొడవలు పెట్టడం కాదు.
ఇక ఆయన ఓసారి దేవుడిని నమ్మి దేవాలయాలకు వెళ్లే వారిని కించపరుస్తూ గుడి మెట్లపై 24గంటలు అడుక్కునే బిచ్చగాడిని బాగుచేయలేని దేవుడు, ఎప్పుడు నెలకు ఒక్కసారి ఇలా వచ్చి అలా దణ్ణం పెట్టుకునే నిన్ను బాగుచేస్తాడా? అని వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ఇక ముస్లింలు, ఇతర మైనార్టీలను టార్గెట్ చేస్తే ప్రమాదకమరని 'విశ్వరూపం'తో తెలుసుకున్న ఆయన ఇప్పుడు హిందువులను ఉగ్రవాదులతో పోలుస్తున్నాడు. దీనిపై శ్రీపీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద స్వామి ఆగ్రహించారు.
రాజకీయంగా ఎదగడానికి హిందువులను తిడితే నాయకులు అవుతారా? కమల్ లోకనాయకుడు కాదు.. ఆయన లోకల్ నాయకుడు. ఆయన ఓ ఉగ్రవాదితో సమానం. హిందువులను అవమానించి కమల్ ధర్మద్రోహిగా మారాడు. ఆయన తీస్తున్న చిత్రాలన్నీ ఫ్లాప్ అవుతుండటంతో ఆయన పిచ్చి పట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. హిందువులను తీవ్రవాదులన్న వారు నిజంగా ఉగ్రవాదులే. ఆయన అనుసరిస్తున్న ధర్మం హిందు మతంది కాదా? హిందు సమాజం ఆదరించబట్టే ఆయనకు పేరు ప్రఖ్యాతలు, కావాల్సినంత ధనం, విలాసాలు, సుఖసౌకర్యాలు రావడం నిజం కాదా? ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినా హిందు మతాన్నే అనుసరిస్తూ అన్ని మతాలను సమానంగా చూసేవారు. కమల్ వంటి వారు ఎన్టీఆర్ చూపించిన మార్గంలో పయనించాలి. చీప్ ట్రిక్స్ చేయవద్దని ఆయన ఆగ్రహం వెలిబుచ్చారు. ఇక ఈ బర్త్‌డే సందర్భంగా కమల్ 'విశ్వరూపం 2' ట్రైలర్‌ని, తన పార్టీని ప్రకటించనున్నాడు.