బాలీవుడ్‌లో కంగనారౌనత్ ప్రధాన పాత్రలో, ఆమెకు స్నేహితురాలైన విజయలక్ష్మి పాత్రలో లీసా హెడెన్ నటించిన 'క్వీన్' చిత్రం అక్కడ కేవలం 12 కోట్లతో రూపొంది 100కోట్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించింది. ఇక చిత్రం దక్షిణాది హక్కులను హీరో ప్రశాంత్ తండ్రి, నటుడు, దర్శకుడు అయిన త్యాగరాజన్ తీసుకుని ఎంతో కాలం అయింది. అయినా అవి ఇప్పటికీ పట్టాలెక్కపోవడంతో ఈ రీమేక్ రైట్స్‌ని మను కుమారన్ తీసుకుని షూటింగ్ ప్రారంభించేశాడు.
ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కి 'క్వీన్' అనే అదే టైటిల్‌ని పెట్టి, తమన్నాని 'క్వీన్' రోల్‌కి తీసుకున్నారు. ఇక తమిళంలో 'ప్యారిస్ ప్యారిస్'తో రీమేక్ కానున్న ఇందులో క్వీన్‌గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక మలయాళంలో ఈ చిత్రంలో మంజిమా మోహన్ నటిస్తుండగా, 'జామ్ జామ్' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. మరోవైపు ఇదే చిత్రం కన్నడలో 'బటర్‌ఫ్లై' అనే పేరుతో రూపొందుతోంది. ఇక తెలుగు వెర్షన్‌కి నీలకంఠ దర్శకత్వం వహిస్తుండగా, మిగిలిన భాషలకు రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం ఈ నాలుగు భాషల్లోని ఈ చిత్రం రీమేక్స్ షూటింగ్ పారిస్‌లో చిత్రీకరిస్తున్నారు. ఇక విజయలక్ష్మి పాత్రకు లీసాహెడెన్ పాత్రలో అమీజాక్సన్‌ని తీసుకున్నారు. ఆమె ఓకే కూడా చెప్పింది. కానీ షూటింగ్‌లు లేటు కావడం, ఒకవైపు 'ఐ' తర్వాత '2.0'లో రజనీకాంత్ సరసన నటిస్తుండటం, ఇదే సమయంలో ఆమెకి అమెరికన్ టీవీ సీరిస్ 'సూపర్‌గర్ల్'లో చాన్స్ రావడంతో ఆమె తప్పుకుంది. దీంతో విజయలక్ష్మి పాత్రకు తెలుగు, మలయాళంలో శిబాని దండేకర్‌ని తీసుకున్నారు. ఈమె సల్మాన్‌ఖాన్ 'సుల్తాన్', తాప్సి నటించిన 'నామ్ షబానా'లో నటించింది. ఇక ఈమెకు దేశవ్యాప్తంగా ఐపిఎల్ క్రికెట్ వ్యాఖ్యతగా మంచి పేరుంది. ఇక ఇదే పాత్రను తమిళ-కన్నడ భాషల్లో హిందీ నటి ఎలి ఎవరామ్‌ని ఎంపిక చేశారు.