సమంత సినిమాలలో, సినిమా ఫంక్షన్లు, ఇతర వేడుకలు, పెళ్లిలల్లో, సోషల్ మీడియాలో కూడా చేసే అల్లరి మామూలుగా ఉండదు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఈ చెన్నై చిన్నది చూడటానికి అల్లరిపిల్లగానే కనిపిస్తుంది కానీ ఆమెలో మరో కోణం కూడా ఉంది. ఇటీవల ఆమె దేవుడిని ప్రార్ధిస్తూ.. ఇక నా జీవితంలో నేనే దేవుడిని ఏదీ కోరుకోను. ఆయన నాకు అన్ని ఇచ్చాడు. అంతకు మించి చైని నాకు భర్తగా ఇచ్చాడు. ఆయన ఉంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు. ఏమైనా దేవుడిని కోరుకోవాలని అనిపిస్తే... నాకు దేవుడు ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే శక్తిని ఇవ్వు అని మాత్రమే కోరుకుంటానని ఎంతో ఉద్వేగంగా చెప్పింది.
ఇక ఈమెలోని మరోకోణం ఏమిటంటే.. దయ, జాలి, కరుణ. ప్రాణాలు పోయడం వీలుకాకపోయినా ప్రాణాలను నిలబెట్టడం ఎంతో పుణ్యం. ఇక ఇప్పటికే హన్సిక, రాఘవలారెన్స్ వంటి వారు పబ్లిసిటీకి పోకుండా ఎందరో చిన్నారులకు విద్య, వైద్యం అందిస్తూ.. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి.. అంటూ నిజం చేస్తున్నారు. ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడే చిన్నారులకు ఆపరేషన్లు చేసి ప్రాణాలు నిలబెట్టడం, అనాథలను దత్తత తీసుకోవడం, వారికి విద్యతో పాటు అన్ని సమకూరేలా చేయడం చేస్తున్నారు.
ఇక అక్కినేని ఇంటి కోడలైన సమంత కూడా పబ్లిసిటీకి దూరంగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆమె ప్రత్యూష అనే స్వచ్చంధ సంస్థని స్థాపించి, తాజాగా ప్రాణాపాయంలో ఉన్న ప్రమాదరకమైన రోగులైన 15 మంది పసికందులకు శస్త్రచికిత్సలు చేయించి, వారి ప్రాణాలను కాపాడి పునర్జన్మనిచ్చింది. ఇందుకు ఆమెకు కోటి రూపాయలకు పైగానే సొంత ఖర్చు అయిందట. పిల్లలందరు క్షేమమని వారి ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఆ దేవునికి ధన్యవాదాలు తెలిపింది. హ్యాట్సాఫ్ సమంత...!