Advertisementt

ముందు వెనుకా చూడకుండా ఈ పుకార్లేమిటి?

Sun 05th Nov 2017 07:25 AM
p susheela,social media,health  ముందు వెనుకా చూడకుండా ఈ పుకార్లేమిటి?
Gossips on P Susheela Health ముందు వెనుకా చూడకుండా ఈ పుకార్లేమిటి?
Advertisement
Ads by CJ

సోషల్‌మీడియా ఉదృతం అయిన తర్వాత లక్షణంగా, ఆరోగ్యంగా ఉన్న వారిని కూడా చంపేస్తున్నారు. మరి కొందరి ఆరోగ్యం సీరియస్‌ అని తమ ఇష్టం వచ్చిన పుకార్లను కొందరు కావాలనే క్రియేట్‌ చేస్తున్నారు. ఇప్పటికే వేణుమాధవ్‌తో సహా పలువురిని మన మీడియానే తమ చేతులతో, మాటలతో చంపేశారు. ఇక తాజాగా నాటి మేటి అద్భుత గాయని పి.సుశీల ఆరోగ్యం విషమంగా ఉందని ఆమెపై ఎవరో ఒక ఆకతాయి పుకారు లేపాడు. దాంతో అది వైరల్‌ అయింది. చివరకు ఈ విషయం తన దాకా వచ్చేసరికి పి.సుశీల ఈ విషయంపై స్పందించారు. నాకేమీ కాలేదు. నేను ఎంతో ఆరోగ్యంగా అమెరికాలో ఉన్నానని చెప్పి, అయినా మన వారు నమ్మరని భావించి కాబోలు ఓ వీడియోను కూడా పోస్ట్‌ చేసింది.

ఇక దీనిపై సుప్రసిద్ద గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా స్పందించారు. సుశీలగారు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఆమె ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్‌లో ఎంతో ఉత్సాహంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చాడు. గతంలో కూడా ఎస్పీబాలు కూడా ప్రాణాపాయంలో ఉన్నాడని వార్తలు వచ్చి దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి వాటిని కట్టడి చేయగలమో లేదో? గానీ ఇలాంటి ఉత్త పుకార్లు పుట్టించే వారు కాస్త మానవత్వంతో ప్రవర్తించాల్సి ఉంది. తమాషాగా చేసిన పుట్టించిన ఇలాంటి గాసిప్స్‌ చావును అపశకునంగా భావించే వారు, వారి బంధువులు, మిత్రులు, సన్నిహితులు, అభిమానులు ఎంతగా ఆవేదన చెందుతారనేది కాస్త ఆలోచిస్తే బాగుంటుంది...!

Gossips on P Susheela Health :

P Susheela Clarity on Her Health

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ