రాజశేఖర్ కి చాలా కాలం తర్వాత 'పిఎస్వీ గరుడవేగ' తో మంచి విజయం దక్కింది. దాదాపు రెండేళ్ల తర్వాత వెండి తెరపై ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'పిఎస్వీ గరుడవేగ' తో వచ్చిన రాజశేఖర్ కి ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో మంచి బూస్ట్ ఇచ్చింది. పూజా కుమార్, శ్రద్ధాదాస్, సన్నీలియోన్ మొదలగు వారు ముఖ్య తారాగణంతో నవంబర్ 3న అత్యధిక ధియేటర్లలో పి ఎస్ వి రిలీజైంది. విడుదల అయిన ప్రతి చోట హిట్ టాక్ రావడంతో యూనిట్ సంబరాలులో మునిగిపోయింది.
అయితే చాలా కాలం తర్వాత ఈ సినిమా హిట్ టాక్ రావడంతో చిత్ర యూనిట్ తో పాటు రాజశేఖర్ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ ఆనందాన్ని చిత్ర యూనిట్‌తో షేర్ చేసుకున్నారు. చిత్రం చిత్ర యూనిట్‌తో కలిసి రాజశేఖర్ డ్యాన్స్‌లు చేస్తూ అలరించారు. రాజశేఖర్ తో పాటు తన కూతుర్లు, శ్రద్ధాదాస్, ప్రవీణ్ సత్తారు, జీవిత డాన్సులు వేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం.. అన్నట్లుగా రాజశేఖర్ వేచిచూస్తున్న హిట్ పడటంతో, తల్లి మరణం తర్వాత డిప్రషన్ కి లోనైనా అయనకు ఈ విజయం సంతోష క్షణాలను ఇచ్చింది.