Advertisementt

కాజల్ కత్తిలా తయారయింది..!

Sat 04th Nov 2017 04:40 PM
kajal agaral,latest pic,social media,paris  కాజల్ కత్తిలా తయారయింది..!
Kajal Shared Her Latest Pic కాజల్ కత్తిలా తయారయింది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ హీరోయిన్స్ కెరియర్ బాగుండాలంటే నటన మాత్రం సరిపోదు. నటనతో పాటు స్కిన్, టోన్ బాగుండాలి... దానితో పాటు అందంగా ఉండాలి. అపుడే వాళ్లకి సినిమాలలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఎంత అందంగా కనబడినప్పటికీ ఒక వయసు వచ్చేప్పటికి.... ఫేస్ లో గ్లో కోల్పోయి ఎబ్బెట్టుగా తయారవుతారు. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం... ఆమెతో పాటు వచ్చిన హీరోయిన్స్ ని తలతన్నేలా రోజు రోజు కి ఇంకా అందంగా మారుతుంది. ఇందుకు ఉదాహరణ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా.

ప్రస్తుతం ఆమె తన కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన సినిమాలో నటిస్తోంది. ఆమె తొలిసారి లేడీ ఓరియెంటెడ్ ‘క్వీన్’ తమిళ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే ఈ చిత్ర షూటింగ్లో భాగంగా పారిస్ కి వెళ్లిన కాజల్.. అక్కడి నుంచి ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. కుర్రకారు మతి పోయేలా ఆ ఫోటో వుంది. సోషల్ మీడియాలో ఆమె అందం చూసి తన ఫ్యాన్స్ లైక్ లు మీద లైక్ లు కొడుతున్నారు. 

ఈ ఫొటో చూస్తే ఈ తరం హీరోయిన్లు కూడా ఆమె ముందు దిగదుడుపే అన్నట్లే ఉంది. కాజల్ ని ఇలా చూశాక.. ఆమె కెరీర్ కి ఇంకో ఐదారేళ్ళ ఢోకా లేదనిపించేలా ఉంది.

Kajal Shared Her Latest Pic:

Kajal Agarwal Latest Pic Sensation in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ