Advertisementt

అమలా.. క్లారిటీ ఇచ్చినా, నమ్ముతారా?

Sat 04th Nov 2017 12:49 PM
amala paul,car issue,puducherry  అమలా.. క్లారిటీ ఇచ్చినా, నమ్ముతారా?
Amala Paul Clarity on Car Issue అమలా.. క్లారిటీ ఇచ్చినా, నమ్ముతారా?
Advertisement
Ads by CJ

డబ్బు సంపాదించి, కోట్లు కూడబెట్టిన వారు కూడా రూపాయి విషయంలో కూడా తమ కక్కుర్తిని చూపిస్తారు. ఇక సినీ నటుల విషయానికి వస్తే వారు ఏదైనా షాపింగ్‌ మాల్స్‌ వంటి ఓపెనింగ్స్‌కి వెళ్లితే, దానికి తగ్గ రెమ్యూనరేషన్‌ తీసుకుని కూడా అక్కడి డ్రస్‌లనో, లేక బంగారు ఆభరణాలనే అడిగి మరీ ఫ్రీగా తీసుకుంటారు. మరికొందరు నటీనటులు భోజనం, జ్యూస్‌లు ఎప్పుడు తిని, తాగని వారిలా కక్కుర్తి పడుతూ, సినిమా షూటింగ్‌లలో డిమాండ్‌ చేసి మరీ తమ కక్కుర్తిని చూపిస్తారు. ఇలాంటి వారిని చూసే కొందరు 'ఎర్న్‌ లైక్‌ దట్‌.. బట్‌ డోంట్‌ బిహేవ్‌ లైక్‌దట్‌' అంటారు. ఇక కోట్లకు పడగలెత్తిన క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ తనకి విదేశాలలో మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌గా ఎంపికైనందుకు ఇచ్చిన కారు గిఫ్ట్‌కి పన్ను మినహాయింపు ఇవ్వాలని, చాలా చిన్న మొత్తానికే నానా హంగామా చేశాడు. 

ఇక విషయానికి వస్తే తన వ్యక్తిగత జీవితంలో ప్రేమ, పెళ్లి, విడాకులు, ధనుష్‌తో ఎఫైర్లు, సినిమాలలో వివాదాలతో సహవాసం చేసే హీరోయిన్‌ అమలాపాల్‌. ఆమె తాజాగా ఓ ఎస్‌-క్లాస్‌ బెంజికారును కొనుక్కుంది. దానికి రోడ్‌ ట్యాక్స్‌ కింద రూ.20లక్షల దాకా కట్టాల్సివుంది. దాంతో ఆమె పాండిచ్చేరి (పుదుచ్చేరి)లోని ఓ నకిలి అడ్రస్‌ పత్రాలను సృష్టించి ఆ 20లక్షలను కట్టకుండా తప్పించుకుందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ వంటి వ్యక్తి ఆమెపై విచారణకు ఆదేశించింది. ఓ విషయంలో లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ స్థాయి వ్యక్తి విచారణకు ఆదేశించడం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. 

కానీ పుదుచ్చేరికి చెందిన రెవిన్యూ, రవాణా శాఖ మంత్రి షాజహాన్‌ అమలాపాల్‌కి క్లీన్‌ చిట్‌ ఇచ్చాడు. ఈ విధంగా ఆయన క్లీన్‌ చిట్‌ ఇవ్వడం వెనుక ఎంతో తతంగం నడించిదని సమాచారం. ఇక తాజాగా అమలాపాల్‌ ఈ విషయం గురించి ట్విట్టర్‌తో స్పందిస్తూ, ఈ నగరం నుంచి, ఈ ఊహాగానాలు నుంచి పారిపోవాలనిపిస్తోంది. అందుకే బోట్‌ రైడ్‌కి వెళ్లాలనుకుంటున్నాను. దానికైతే ఏ గొడవ ఉండదు కదా! అంటూ వ్యంగ్యంగా స్పందించింది. తప్పు చేసి దానిని కప్పి పుచ్చడం ఎలాగో అమలాపాల్‌ నుంచి నేర్చుకోవాల్సిందే...! 

Amala Paul Clarity on Car Issue:

Amala Paul Car Issue Ended

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ