Advertisementt

విజయ్ సినిమాలో ఈ ఇద్దరికీ ఛాన్స్!

Sat 04th Nov 2017 12:06 PM
vijay,ar murugadoss,rakul preet singh,sonakshi sinha  విజయ్ సినిమాలో ఈ ఇద్దరికీ ఛాన్స్!
Rakul and Sonakshi Sinha in Vijay and AR Murugadoss Film విజయ్ సినిమాలో ఈ ఇద్దరికీ ఛాన్స్!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం స్టార్‌ హీరో, ఇలయదళపతి విజయ్‌ నటించిన 'మెర్శిల్‌' చిత్రం తమిళనాట బాగానే ఆడుతోంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్‌ 'అదిరింది' చిత్రం ఇక విడుదలయ్యే అవకాశం లేదని, శరత్‌మరార్‌ లేదా అల్లుఅరవింద్‌లలో ఒకరు ఈచిత్రాన్ని రీమేక్‌ చేస్తారని అంటున్నారు. ఇక 'మెర్శల్‌' చిత్రం తర్వాత విజయ్‌ మరోసారి మురుగదాస్‌ దర్శకత్వంలో నటించనున్నాడు. గతంలో విజయ్‌ హీరోగా మురుగదాస్‌ తీసిన 'తుపాకి, కత్తి' చిత్రాలు ఘనవిజయం సాధించాయి. దీంతో వీరిద్దరి హ్యాట్రిక్‌ మూవీగా విజయ్‌ నటించే 62వ చిత్రం తెరకెక్కనుంది. 

ఇక నేటి రోజుల్లో కుర్రహారోల నుంచి కొత్తగా వచ్చేవారికి కూడా ఇద్దరు హీరోయిన్లు కంపల్సరీ అయిపోయారు. ఇక స్టార్‌ హీరోలకైతే ముగ్గురు హీరోయిన్లు, ఐటం సాంగ్‌లకు మరో ముద్దుగుమ్మలు ఉంటేనే బాగుంటుందని మేకర్స్‌ భావిస్తున్నారు. దానికి తగ్గట్లుగానే విజయ్‌-మురుగదాస్‌ చిత్రంలో కూడా ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేశారు. మురుగదాస్‌ మహేష్‌బాబుతో తీసిన డిజాస్టర్‌ 'స్పైడర్‌'లో నటించిన రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇందులో ఒకరు. 

ఇక రజనీకాంత్‌తో 'లింగా' వంటి డిజాస్టర్‌ చిత్రంలో నటించిన బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనాక్షిసిన్హా మరొకరు. ఈమెతో కూడా మురుగదాస్‌ 'అకిర' అనే చిత్రాన్ని బాలీవుడ్‌లో తీశాడు. ఇది కూడా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. మరోపక్క రకుల్‌ప్రీత్‌సింగ్‌కి టాలీవుడ్‌లో గానీ, సోనాక్షిసిన్హాకు బాలీవుడ్‌లో కానీ చిత్రాలు లేవు. మరి ఈ ఇద్దరు ఐరన్‌లెగ్‌ భామలతో మురుగదాస్‌-విజయ్‌లు ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారో చూడాల్సివుంది....! 

Rakul and Sonakshi Sinha in Vijay and AR Murugadoss Film :

Vijay and AR Murugadoss Film  Heroines Finalized 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ