Advertisementt

వర్మ చిత్రంలో ఈసారి నాగ్ పాత్రేంటో తెలుసా?

Sat 04th Nov 2017 11:51 AM
nagarjuna,rgv,police,shiva movie  వర్మ చిత్రంలో ఈసారి నాగ్ పాత్రేంటో తెలుసా?
Nagarjuna Police in RGV Film వర్మ చిత్రంలో ఈసారి నాగ్ పాత్రేంటో తెలుసా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ... తీసిన సినిమాలేమి బాక్సాఫీసుని గడగడలాడించడం లేదు. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా అంటేనే ఒక సెన్సేషన్. కానీ గత కోనేళ్ళుగా వర్మ వివాదాలతో ఎక్స్ పోజ్ అయినట్టుగా సినిమాల విషయంలో మాత్రం అవ్వడం లేదు. ఆయన వివాదాల చుట్టూ తిరిగే పనిలో రొటీన్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. ఇప్పుడు కూడా తాజాగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని తెరకెక్కిస్తానంటూ నానా రచ్చ చేసాడు. మరి చేతిలో ఒక్క హిట్ కూడా లేని వర్మతో నాగార్జున ఒక సినిమా ఫైనల్ చెయ్యడం కూడా అందరిని ఆశ్చర్యంలో పడేసింది. ఒకప్పుడు వర్మ.. 'శివ' వంటి సినిమాతో నాగార్జునకు తిరుగులేని హిట్ ఇచ్చాడు. మరి ఆ కృతజ్ఞతతోనే నాగ్ ఇప్పుడు వర్మ దర్శకత్వంలో నటించడానికి రెడీ అయ్యాడు. 

మరి రామ్ గోపాల్ వర్మ చెప్పిన కథ నాగార్జునకు అంతలా నచ్చబట్టే సినిమాని ఒప్పుకున్నాడంటున్నారు. అయితే నాగార్జునతో వర్మ తియ్యబోయేది రియలిస్టిక్ యాక్షన్ ఫిలిం అని రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో ప్రకటించాడు. అయితే ఈ సినిమాలో నాగార్జున ఫెరోషియస్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడట. ఈ రోల్....ఆ క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది కాబట్టే నాగార్జున వర్మతో సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడని అంటున్నారు. మరి నాగార్జున ఇప్పటికే 'ఆవిడ మా ఆవిడా, నిర్ణయం, శివమణి' ఇంకా చాలా సినిమాల్లో పోలీస్ పాత్రల్లో ఇరగదీశాడు. ఇక వర్మ - నాగార్జున ల కలయికలో రాబోతున్న సినిమా నవంబర్ 20 న సెట్స్ పై కెళుతుందనే సమాచారం ఉంది.

ఇక ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత. వర్మ ఈ చిత్రాన్ని ‘కంపెనీ’ బేనర్ మీద నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రాన్ని వర్మ - నాగ్ లు ఇద్దరు మూడు నెలల్లో పూర్తి చేసి విడుదల చెయ్యాలనే పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ని తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నాడు.

Nagarjuna Police in RGV Film:

Nagarjuna and Ram gopal Varma Film Ready to Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ