యంగ్ టైగర్ ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా గ్రాండ్ గా ప్రారంభోత్సవం చేసుకుంది. మెగా హీరో పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మొదలయిన ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసుకోబోతుంది. అయితే మిగిలిన ఈ రెండు నెలల్లో ఈ సినిమా యొక్క కాస్టింగ్ ని ఓకే చేసే పనిలో చిత్ర బృందం వుంది. ఇప్పటికే ఎన్టీఆర్ పక్కన దువ్వాడ జగన్నాథం భామ పూజ హెగ్డేని సెలెక్ట్ చేశారని ప్రచారం జరుగుతుండగా.. ఇప్పుడు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కోసం త్రివిక్రమ్ సీనియర్ హీరోయిన్ అయిన బాలీవుడ్ నటి టబుని సజెస్ట్ చేశాడట. సినిమాలో ఎన్టీఆర్ పాత్రకి సమానమైన కేరెక్టర్ టబుకి ఉండనుందట. అయితే ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్ డెసిషన్ కి అడ్డు చెప్పాడనే టాక్ వినబడుతుంది.
అంతటి ఇంపార్టెంట్ రోల్ కి టబు పర్ఫెక్ట్ గా సూట్ కాదని... టబు ప్లేస్ లో వేరొకరిని తీసుకుందాం అని ఎన్టీఆర్, త్రివిక్రమ్ కి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి స్టార్ హీరో అయిన ఎన్టీఆర్ అలా చెప్పేసరికి చేసేది లేక త్రివిక్రమ్... ఆ కీలక పాత్ర కోసం మరో సీనియర్ హీరోయిన్ వేట మొదలైనట్లుగా టాక్. మరి ఈ సినిమాలో కీ రోల్ పోషించే ఆ క్యారెక్టర్ ని ఎవరని సెలెక్ట్ చేస్తారో అనేది కాస్త ఇంట్రెస్టింగ్ కలిగించే విషయమే. మరి త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పాత్రకి సమానంగా ఉండే పాత్ర కోసం నదియా వంటి నటిని తీసుకుని సక్సెస్ అయిన త్రివిక్రమ్... ఇప్పుడు కూడా ఎన్టీఆర్ సినిమాలో అలాంటి పాత్రనే తయారు చేసాడన్నమాట. మరి ఈ కేరెక్టర్ కోసం త్రివిక్రమ్ - ఎన్టీఆర్ లు ఎవరిని ఫైనల్ చేస్తారో అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.