మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న 'భరత్ అనే నేను' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆల్‌రెడీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ట్యూన్స్‌ని ఇచ్చేశాడట. ఇక మహేష్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 25 వ చిత్రం వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్‌రాజు, అశ్వనీదత్‌ల నిర్మాణ భాగస్వామ్యంలో నిర్మితం కానుంది. 'భరత్ అనే నేను' టైటిల్‌ని వింటేనే ఇది పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో మంచి నాయకుడు ఎలా ఉండాలి? అనేపాయింట్ మీద కొరటాల శివ తనదైన మెసేజ్‌తో రూపొందిస్తున్నాడని తెలుస్తోంది. కానీ మహేష్ తన 25వ చిత్రంగా యాక్షన్, ఫ్యామిలీ, ఫ్యాక్షన్... ఇలా ఏ జోనర్‌లో చేయనున్నాడో మాత్రం అర్ధం కావడం లేదు. దీనిపై కాస్త క్లారిటీ రావాలంటే టైటిల్‌ని అనౌన్స్ చేసే వరకు ఆగక తప్పదు.
'కృష్ణా ముకుందా మురారి, హరేరామ...హరేకృష్ణ' అనే టైటిల్స్ ప్రచారంలోకి రావడంతో ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎంటర్‌టైనర్ అని భావించారు. కానీ ఈ చిత్రం టైటిల్ ఈ రెండు కావని వంశీ పైడిపల్లి మరలా కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టేశాడు. ఇక ఈ చిత్రం మ్యూజికల్ సిట్టింగ్స్ న్యూయార్క్‌లో దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలలో ఒకరైన దిల్‌రాజు, సంగీత దర్శకుడు దేవిశ్రీతో జరుగుతున్నాయి. స్టోరీలు సాధారణంగా సంగీత దర్శకులకు ముందుగానే తెలుస్తాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ అయితే పూర్తి కథ వినందే సంగీతం అందించడు. దాంతో ఆయన స్టోరీని విన్న తర్వాత 'అమేజింగ్, ఎక్స్‌ట్రార్డినరీ స్టోరీ.. ఎంతో ఇన్‌స్పైరింగ్' గా ఉందని చెప్పాడు.
ఇక పవన్‌కళ్యాణ్ నటించిన ఇండస్ట్రీ హిట్ అయిన 'అత్తారింటికి దారేది' ట్యూన్స్‌ని కూడా నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్, దేవిశ్రీతో కలిసి స్పెయిన్ లో సిట్టింగ్స్ జరిపాడు. అదే తరహాలో న్యూయార్క్ లో ఈ మహేష్ చిత్రం సిట్టింగ్స్ జరుగుతుండటంతో ఈ చిత్రం కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుందేమో చూడాలి. ఇప్పటికే మూడు ట్యూన్స్ రెడీ అయ్యాయని చెప్పేశారు. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్.. బోయపాటి శ్రీను, ఆ తదుపరి రాజమౌళిలతో చిత్రాలు చేయనున్నాడని కన్‌ఫర్మ్‌గా చెబుతున్నారు.