వాస్తవంగా హాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా బౌండెడ్ స్క్రిప్ట్ అనే ఆచారం ఉంది. కొందరు కేవలం కథను గొప్పగా చెబుతూ, అలా ఉంటుంది? ఇలా ఉంటుంది? అని ఊరించి నటీనటులను ఒప్పిస్తుంటారు. కానీ షూటింగ్‌లో మాత్రం అంతా తేడానే. అలాంటి వారిలో మెహర్‌రమేష్, పూరీజగన్నాథ్, కృష్ణవంశీ వంటి వారి పేరును చెప్పవచ్చు. వీరు సన్నివేశం తీసేటప్పుడు తమకు తోచిన మార్పులు చేర్పులు చేస్తుంటారు. ఇక మన హీరోలకు కూడా బౌండెడ్ స్క్రిప్ట్‌ని చదవి ఊహించుకుని, విజన్‌లో ఆలోచించే సత్తా ఏ కొందరికో తప్ప మిగిలిన వారికి ఆ విజన్ లేదు. కానీ ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ అనేది మంచి పద్దతి.
ఇక రేపు రాజశేఖర్ హీరోగా ప్రవీణ్‌సత్తార్ దర్శకత్వంలో రూపొందిన 'పీఎస్వీగరుడవేగ' ప్రతిష్టాత్మకంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రవీణ్‌సత్తార్‌ని మీరు కథను బట్టి నటీనటులను తీసుకుంటారా? లేక హీరోలను బట్టి కథను రాసుకుంటారా? అని ప్రశ్నించగా ఆయన మాట్లాడుతూ, నాకు కథలను బాగా చెప్పడం రాదు. మొదట బౌండెడ్‌స్క్రిప్ట్ రెడీ చేసుకుని అది పూర్తయిన తర్వాత నటీనటులను కలుస్తాను. ఇక నాకు కథ చెప్పడం రాదనే కాదు.. నాకు అలా చెప్పడం ఇష్టం కూడా ఉండదు. పూర్తి స్క్రిప్ట్ ఇస్తే నటీనటులకు సౌకర్యంగా ఉంటుంది. తమ పాత్రల్లో తాము ఊహించుకుంటారు.
కథ, కథనం, ఎక్కడ ఏం జరుగుతుందో వారికి పూర్తిగా తెలుస్తుంది. వారికి ఏదైనా సందేహం వస్తే నివృత్తి చేయడానికి వీలుంటుంది. అందుకే నాకు పేపర్ వర్క్ అంటేనే ఇష్టం. ఇక నేను ఎక్కడికి వెళ్లినా రాజశేఖర్‌తో అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా? అని అడుగుతున్నారు. అసలు బడ్జెట్ ఇంత అని చెప్పడమే వేస్ట్. నేడు ఎన్నో చిత్రాలు మూడు నాలుగు కోట్లతో తెరకెక్కి 40, 50 కోట్లు వసూలు చేయడం చూస్తున్నాం. కాబట్టి బడ్జెట్ కంటే కంటెంట్ ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చాడు.