Advertisementt

'జై సింహా'కి రెస్పాన్స్ అదుర్స్!

Thu 02nd Nov 2017 06:01 PM
balakrishna,jai simha,first look,balakrishna jai simha,nbk 102  'జై సింహా'కి రెస్పాన్స్ అదుర్స్!
Balakrishna Jai Simha First Look Released 'జై సింహా'కి రెస్పాన్స్ అదుర్స్!
Advertisement
Ads by CJ

సినిమాలు ఎలా ఉన్నా బాలయ్య నటించే చిత్రాల ఫస్ట్‌లుక్స్‌, టైటిల్స్‌ మాత్రం ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ఇక డైలాగ్‌లు కూడా ఆయన చిత్రాలలో కీలకపాత్ర పోషిస్తాయి. కాగా ఆయన తన 101వ చిత్రం 'పైసావసూల్‌' తర్వాత తమిళ సీనియర్‌ దర్శకుడు కె.యస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తన 102వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని, మోషన్‌ పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు. ఈ లుక్‌లో బాలయ్య కోరమీసంతో ఆకట్టుకుంటున్నాడు. టైటిల్‌ 'జై సింహా'లో కూడా ఎంతో పవర్‌ కనిపిస్తోంది. 

బాలయ్యకి 'సింహా'తో వచ్చిన టైటిల్స్‌ బాగా కలసి వచ్చాయి. 'లక్ష్మీనరసింహ, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, సింహా' చిత్రాలు ఆయన కెరీర్‌లో మైల్‌స్టోన్స్‌గా నిలిచిపోయాయి. ఇక ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నటాషాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో బాలయ్య గెటప్‌తో పాటు బ్యాగ్రౌండ్‌లో ఎన్టీఆర్‌ విగ్రహం, వైజాగ్‌లో తీసిన సన్నివేశాల సీన్స్‌, అందులో మరో గెటప్‌లో మాములుగా కనిపిస్తున్నాడు. దీంతో ఆయన ఈచిత్రంలో రెండు విభిన్నమైన షేడ్స్‌ ఉన్న పాత్రను చేస్తున్నాడా? లేక రెండు విభిన్నపాత్రలు పోషిస్తున్నాడా? అనేది ఆసక్తిని రేపుతోంది. 

ఇక ఈ చిత్రంలో బాలయ్య పోలీస్‌పాత్రలో మరియు ఉద్యమనాయకుడి పాత్రలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ మోషన్‌పోస్టర్‌ని బ్రహ్మానందం సోషల్‌ మీడియాలో పెట్టి గర్జిస్తున్న జైసింహా ఇక్కడ ఉన్నాడు... అని కామెంట్‌ పెట్టాడు. సంక్రాంతికి విడుదలకు సిద్దమవుతున్న ఈచిత్రం ఫస్ట్‌లుక్‌, టైటిల్‌, మోషన్‌పోస్టర్‌ని చూసి నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 

Balakrishna Jai Simha First Look Released:

Sensational Response to Balayya Jai Simha First Look

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ