Advertisementt

ఇద్దరు స్టార్‌ హీరోల చిత్రాలలో ఛాన్స్ కొట్టేసింది!

Thu 02nd Nov 2017 11:55 AM
pooja hegde,mahesh babu,jr ntr,trivikram srinivas,pooja hegde with big heroes  ఇద్దరు స్టార్‌ హీరోల చిత్రాలలో ఛాన్స్ కొట్టేసింది!
Pooja Hegde in Mahesh and NTR Film ఇద్దరు స్టార్‌ హీరోల చిత్రాలలో ఛాన్స్ కొట్టేసింది!
Advertisement
Ads by CJ

తెలుగులో 'ఒక లైలా కోసం, ముకుందా' చిత్రాలలో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన నటి పూజాహెగ్డే. ఇక బాలీవుడ్‌లో ఆమెకు ఏకంగా హృతిక్‌ రోషన్‌ హీరోగా రూపొందిన 'మొహంజదారో' చిత్రంలో అవకాశం వచ్చినా కూడా, అది కూడా భారీ డిజాస్టర్‌ కావడంతో ఈమెకి ఐరన్‌లెగ్‌ ముద్ర వేశారు. కానీ మెగాహీరో వరుణ్‌తేజ్‌ సరసన నటించడంతో ఆమె.. అల్లుఅర్జున్‌ నటించిన 'డిజె' చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికై ఆశ్చర్యపరిచింది. తన మొదటి మూడు చిత్రాలలో పద్దతిగా కనిపించిన ఆమె 'దువ్వాడ జగన్నాథమ్'లో మాత్రం గ్లామర్‌, స్టెప్స్‌తో అదరగొట్టింది. ఇక ప్రస్తుతం ఈమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా శ్రీవాస్‌ దర్శకత్వంలో రూపొందున్న 'సాక్ష్యం' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ముంబై వెళ్లి మరో చాన్స్‌ కోసం హృతిక్‌కి రిక్వెస్ట్‌ కూడా చేసింది. 

మరోవైపు దిల్‌రాజుకి నచ్చితే ఆయన తన హీరోయిన్లకు రెండో ఛాన్స్‌ కూడా ఇస్తాడు. ఇదే తరహాలో 'డిజె' హిట్ కి సగభాగమైన పూజాని త్వరలో దిల్‌రాజు, అశ్వనీదత్‌ల భాగస్వామ్యంలో వంశీపైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించే ప్రతిష్టాత్మక 25వ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపిక చేశాడని వార్తలు వస్తున్నాయి. ఇక త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దృష్టి కూడా పూజాహెగ్డేపై పడిందని, ఆయన ఎన్టీఆర్‌ హీరోగా హారిక అండ్‌ హాసిని బేనర్‌లో తీయనున్న చిత్రంలో కూడా పూజాని ఎంపిక చేశాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రంలో ఒక హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్‌ని తీసుకున్నాడని సమాచారం. 

ఈయన కూడా తన హీరోయిన్లను మరలా రిపీట్‌ చేసే అలవాటు ఉంది. దాంతో ప్రస్తుతం త్రివిక్రమ్‌.. పవన్‌కళ్యాన్‌తో తీస్తున్న చిత్రంలో సెకండ్‌హీరోయిన్‌గా నటించిన అనుఇమ్మాన్యుయేల్‌ని తీసుకున్నాడు. ఇక స్టార్‌ చిత్రాలలో, మరీ ముఖ్యంగా త్రివిక్రమ్‌, ఎన్టీఆర్‌ చిత్రాలలో ఇద్దరు హీరోయిన్లు కంపల్సరీ. దాంతో మరో హీరోయిన్‌గా త్రివిక్రమ్‌.. పూజాహెగ్డేని తీసుకోవాలని భావిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఈ రెండు చిత్రాలు జనవరికే మొదలై, దాదాపు ఒకే సమయంలో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ వార్తలే నిజమైతే పూజాహెగ్డే నక్క తోకని తొక్కిందనే చెప్పాలి! 

Pooja Hegde in Mahesh and NTR Film:

Pooja Hegde Got Two Big Chances

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ