Advertisementt

'ఝాన్సీ' రాజసం ఉట్టిపడుతోంది!

Wed 01st Nov 2017 11:47 PM
kangana ranaut,manikarnika,krish,pics  'ఝాన్సీ' రాజసం ఉట్టిపడుతోంది!
Kangana Ranaut Manikarnika Look 'ఝాన్సీ' రాజసం ఉట్టిపడుతోంది!
Advertisement
Ads by CJ

'క్వీన్‌' చిత్రంతో అద్భుతమైననటిగా, ఓవర్‌నైట్‌ తన ఇమేజ్‌ని పెంచుకున్న కంగనా రౌనత్‌ ఆ చిత్రం తర్వాత మరోసారి తన సత్తా చూపేందుకు రెడీ అవుతోంది. ఆమె ప్రస్తుతం రాణి ఝాన్సీలక్ష్మీబాయ్‌ జీవిత చరిత్ర ఆధారంగా 'మణికర్ణిక' (ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ) అనే చిత్రంలో నటిస్తోంది. 'గౌతమీపుత్ర శాతకర్ణి' వంటి బయోపిక్‌ని బాలయ్య వంటి స్టార్‌ని పెట్టుకుని కేవలం 79రోజుల్లో, అద్భుతమైన క్వాలిటీ, గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌తో లిమిటెడ్‌ బడ్జెట్‌లో సినిమాని తీసి తన సత్తాని చాటిన తెలుగు దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇక 'భజరంగీ భాయిజాన్‌, బాహుబలి-ది బిగినింగ్‌, బాహుబలి-ది కన్‌క్లూజన్‌, మెర్సల్' చిత్రాలకు రచయితగా పనిచేసిన విజయేంద్రప్రసాద్‌ ఈచిత్రానికి అద్భుతమైన ట్విస్ట్‌లతో కథను ఇవ్వడంతో ఈ చిత్రంపై నార్త్‌ ఇండియాలోనే కాదు.. సౌత్‌ఇండియాలో కూడా ఆసక్తి పెరుగుతోంది. ఇక తాజాగా ఈ చిత్రంలో ఝాన్సీలక్ష్మీబాయ్‌గా కనిపిస్తున్న ఫొటోలు లీక్‌ అయ్యాయి. ఈ ఫొటోలలో కత్తి ఒరలో పట్టుకుని, నాటి రాణులు వేసిన డ్రస్‌లు, తలపాగాలతో కంగనారౌనత్‌ ఝాన్సీలక్ష్మిబాయ్‌గా కనిపిస్తున్న గెటప్‌, ఆమె హావభావాలు, రాజసం ఉట్టిపడుతున్న తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. 

'గౌతమీపుత్ర శాతకర్ణి'లో బాలయ్యని శాతకర్ణి గెటప్‌లో అద్బుతంగా చూపించిన క్రిష్‌ 'ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ'లో కూడా అదే మాయాజాలం చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే సగం పూర్తయినా కూడా ఈ చిత్రంలోని లుక్స్‌ని యూనిట్‌ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు. చూపుల్లో వాడి, వేడిని చూపిస్తున్న ఈ చిత్రం రాజస్థాన్‌లోని జైపూర్‌లో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. తర్వాతి షెడ్యూల్‌ని జోధ్‌పూర్‌లో చేయనున్నారు. ఇక ప్రభాస్‌ 'సాహో' చిత్రానికి సంగీతం అందిస్తున్న బాలీవుడ్‌ మ్యూజిక్‌త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌లు 'మణికర్ణిక'కి కూడా సంగీతం అందిస్తున్నారు. ఎలాగైనా ఈ చిత్రానికి స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తోపాటు షూటింగ్‌ మొత్తం పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌ కానుకగా ఏప్రిల్‌27న రిలీజ్‌ చేయాలని క్రిష్‌ నిర్ణయించాడు. 

Kangana Ranaut Manikarnika Look :

Krish and Kangana Ranaut Manikarnika Movie Pics Sensation In Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ