మన దేశంలో ఉన్న కుల వ్యవస్థకు వ్యతిరేకంగా రాజ్యాంగం రాసే సమయంలో.. కుల వివక్షతకు వ్యతిరేకంగా అంబేడ్కర్ రాజ్యాంగంలో దళితులకు, వెనుకబడిన కులాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాడు. కానీ దానికి ఆయన కాల పరిధి కూడా పెట్టి, అంతకు మించి రిజర్వేషన్లు కొనసాగితే తీవ్ర పరిణామాలు సమాజంలో తలెత్తుతాయని కూడా చెప్పాడు. కానీ కులాలను ప్రోత్సహించే రాజకీయనేతలు, కుల సంఘాల నాయకులు, ఓట్ల బ్యాంక్ రాజకీయాల కారణంగా ఆ విధానం ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. అది నాడు అంబేడ్కర్ ఊహించినట్లుగానే తప్పుదోవ పట్టింది.
ఇక రిజర్వేషన్లు ఇంత కాలం మన దేశంలో కొనసాగినా కూడా అది ఫలితాలను అందించలేని ఓ ప్రయోగంగానే నిలిచింది. దీనిపై మేధావులు కూడా ఆందోళనవ్యక్తం చేస్తున్నారు. తరంలో ఒకరికి మాత్రమే రిజర్వేషన్ సదుపాయం నిబంధన పెట్టాలని, క్రిమిలేయర్‌ను ప్రవేశపెట్టమని కోరుతున్నారు. ఇక మారుమూల గ్రామాలలో, ఇతర తండాలలో నివసించే హరిజనులు, గిరిజన్లకు అసలు ఇవి ఉన్నాయనే తెలియదు. దాంతో నిజంగా దుర్భరజీవితం గడిపే వారికి ఇవి చేరడం లేదు. మరోవైపు కాస్త చదువుకున్న వారు మాత్రం తరతరాలుగా ఈ సౌకర్యాలను పొందుతూనే ఉన్నారు. దీంతో చాలామంది అగ్రవర్ణాలలోని తిండికి లేక బాధలు పడి, బాగా చదువున్నా అగ్రవర్ణాల వారు అన్యాయానికి గురవతున్నారు. దీంతో ప్రజల్లో నేడు కులాలు ముఖ్యంకాదని, సమాజంలో రెండే వర్గాలు ఉన్నాయని... అది పేదవారు, ధనికులుగా మాత్రమే చూడాలని కొందరు భావిస్తున్నారు.
ఇక కమెడియన్ అయిన పృధ్వీరాజ్ అలియాస్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఈయన తాజాగా మాట్లాడుతూ తాను ఓసీని కాబట్టే తనకు ఉద్యోగం రాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను పోలీ స్‌పరీక్షలలో దేహదారుఢ్య పరీక్షలకు హాజరైతే అక్కడి ఉన్నతాధికారి నువ్వు ఓసీవి.. నీకు ఉద్యోగం రాదు అని చెప్పాడని తెలిపాడు. అదే నేను ఓసీని కాకుండా ఉంటే డీఎస్పీగా ఉండేవాడిని, ఆ తర్వాత నా మాటలతో, చాతుర్యంతో రాజకీయ నాయకులను మచ్చిక చేసుకుని ఏకంగా జిల్లాకు ఎస్పీగా ఉండేవాడినని తెలిపాడు. ఇలా ఉన్నత కులాలలో పుట్టినందువల్లే తమకు ఉద్యోగం రాలేదని భావించే వారి సంఖ్య లక్షల్లో ఉంది.
రాజకీయ నాయకులను ఈ విషయంలో ప్రజలు ప్రశ్నించే రోజులు వస్తాయి. అగ్రవర్ణాలలోని 10 శాతం మంది ఆర్దికంగా, రాజకీయంగా, పలుకుబడితో ఉన్నారు. మరి మిగిలిన 90శాతంమంది పరిస్థితి ఏమిటి? లేనిపోని భేషజాలకు పోవడం తప్ప అగ్రవర్ణాలకు మరింత అన్యాయం జరుగుతోంది. నా క్లాస్‌మేట్స్‌లో నెల్లూరుకు చెందిన శర్మ, గుంటూరుకు చెందిన బ్రాహ్మణులు కలిసి ఉండేవారం. తినడానికి డబ్బులు లేక, ఉద్యోగాలు రాక.. రోజూ కొంచెం బియ్యం తెచ్చుకుని భోజనం చేసేవారం. చదువుకుని, తెలివిఉండి ఈఖర్మ ఏమిట్రా అని నాడే మేము ఎంతో బాధపడేవారిమని పృద్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.