Advertisementt

బోగన్ రీమేక్ పై డౌట్స్..!

Wed 01st Nov 2017 07:22 PM
bogan remake,raviteja,jayam ravi,aravind swamy  బోగన్ రీమేక్ పై డౌట్స్..!
Doubts on Bogan Telugu Remake బోగన్ రీమేక్ పై డౌట్స్..!
Advertisement
Ads by CJ

లాంగ్ గ్యాప్ తీసుకుని 'రాజా ది గ్రేట్' సినిమాతో హిట్ కొట్టాడు రవితేజ. అలాగే విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో 'టచ్ చేసి చూడు' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటే తమిళంలో సూపర్ హిట్ అయిన 'బోగన్' రీమేక్ లో కూడా నటించాల్సి ఉంది. ఈ సినిమాలో రవితేజకి జోడిగా ముందు కేథరిన్ ని ఎంపిక చేసిన చిత్ర బృందం ఆ తర్వాత కేథరిన్ ప్లేస్ లో కాజల్ ని ఎంపిక చేసినట్లుగా వార్తలొచ్చాయి. అరవింద్ స్వామి - జయం రవిలు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ తమిళ బోగన్ ని తెలుగులో కూడా దర్శకుడు లక్ష్మణే దర్శకత్వం వహించనున్నాడని న్యూస్ కూడా హల్చల్ చేసింది.

అన్ని సిద్ధం అనుకుంటూ తెలుగులో పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఈ సినిమాని పట్టాలెక్కించే సమయానికి ఈ సినిమా ఆగిపోయినట్లుగా వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ సినిమా తెలుగులో రీమేక్ కావడం లేదని తెలుస్తుంది. అయితే ఈ సినిమా ఆగిపోవడానికి కారణం ఈ సినిమాని తెలుగులో నిర్మించే నిర్మాతలు ఉన్నట్టుండి డ్రాప్ అవడమే అంటున్నారు. తెలుగులో చుట్టాలబ్బాయి సినిమాను నిర్మించిన నిర్మాతలు...తమిళ బోగన్ ని తెలుగులో రీమేక్ చెయ్యాలని... అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు.  అయితే  కొన్ని అనివార్య కారణాలవల్ల సినిమా ఆరంభంలోనే ఆటంకాలు వచ్చాయని టాక్ వినబడుతుంది. 

ఇక ఈ సినిమా ఆగిపోవడంతో రవితేజ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ చేశాడంటున్నారు. అయితే ఈ సినిమా ఆగిపోయిందనే న్యూస్ చిత్ర బృందం ధృవీకరించాల్సి ఉంది.

Doubts on Bogan Telugu Remake :

No Bogan remake in Tollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ