ఈ మధ్యన తెలుగులో ఆది పినిశెట్టి విలన్ గా, సపోర్టింగ్ కేరెక్టర్స్ లో అదరగొడుతున్నాడు. అల్లు అర్జున్ సరైనోడు సినిమాలో విలన్ కేరెక్టర్ లో ఇరగదీసిన ఆదిపినిశెట్టి... నిన్నుకోరి సినిమాలో నివేద థామస్ భర్తగా ఇంకాస్త ఇరగదీశాడు. ఈ రెండు సినిమాల్తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆది పినిశెట్టి ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలోనూ, మరో మెగా హీరో రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలోనూ కీలక పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాల రెండింటిలోనూ ఆది రోల్ చాలా ముఖ్యమైనది కాబట్టే ఈ సినిమాలకు ఆది సైన్ చేశానని చెబుతున్నాడు.
ఇకపోతే త్రివిక్రమ్ - పవన్ కలయికలో వస్తున్న సినిమాలో ఆది పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతుందంటున్నాడు. ఒక ఐడియాలజీ ఉండే ఇంటెన్స్ పాత్ర నాది అని..... ఇది పూర్తిగా నెగెటివ్ రోల్ కాదు.. అలాగని పాజిటివ్ రోల్ కాదు. అయితే ఆ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఉంటాయి అని చెబుతున్నాడు. ఈ పాత్రను త్రివిక్రమ్ గారు రాసిన తీరే చాలా గొప్పగా ఉంటుందని..... నా కెరీర్లో ఇది మరో ప్రత్యేకమైన పాత్ర అవుతుంది అని చెప్పడమే కాదు.... పవన్ సార్‌తో చేసిన సన్నివేశాల్ని ఎప్పటికీ మరిచిపోలేను. సినిమా విడుదల తర్వాత అందరూ ఆ సన్నివేశాల గురించి గొప్పగా మాట్లాడుకుంటారని చెబుతున్నాడు.
ఇక పవన్ పేరు అంటేనే.... అందరికి ఎంతో పిచ్చి... అలాగే ఎంతో హైప్ ఉంటుంది కానీ.. పవన్ సర్ మాత్రం చాలా సింపుల్ అంటూ మోసేస్తున్నాడు. పవన్ సర్ తో కలిసి పనిచెయ్యడం ఇంకా కలగానే ఉందని చెబుతున్నాడు ఆది పినిశెట్టి. ఇకపోతే పవన్ 'అజ్ఞాతవాసి' జనవరి 10 న విడుదల కాబోతుంది.