'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయాడు విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' హిట్ తో ఎటువంటి కిక్ రాని విజయ్ కి 'అర్జున్ రెడ్డి' కిక్కు బాగా ఎక్కేసింది. ఆ సినిమా విజయంతో విజయ్ ఒక్కసారిగా పాపులర్ అవడమే కాదు... ఫుల్ బిజీ అయ్యాడు. చేతినిండా సినిమాల్తో స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ చేతిలో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. ఆ నాలుగు సినిమాలు కూడా పెద్ద నిర్మాణ సంస్థలో ఉన్నవే కావడం ఇక్కడ విశేషం. అలాగే నిన్న సోషల్ మీడియాలో మణిరత్నం.. విజయ్ దేవరకొండ తో సినిమా ప్లాన్ చేస్తున్నాడన్నారు.
ఇపుడు తాజాగా విజయ్ దేవరకొండ ఈ మధ్యనే 'జై లవ కుశ'తో హిట్ అందుకున్న దర్శకుడి బాబీతో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడనే టాక్ బయటికి వచ్చింది. ప్రస్తుతం దర్శకుడు బాబు 'జై లవ కుశ' తర్వాత ఏ హీరోకి కమిట్ అవ్వలేదు. అల్లు అర్జున్ తో ఫోన్ అన్నారు... ఇదన్నారు... అదన్నారు కానీ ఈ దర్శకుడు ఏ హీరోతో టచ్ లో లేడు. అయితే ఇప్పుడు మాత్రం కొత్తగా బాబీ ఒక స్టోరీ లైన్ విజయ్ దేవరకొండకి వినిపించాడని.....ఆ లైన్ కి ఫిదా అయిన విజయ్, బాబీని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసుకోమన్నాడనే న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది.
మరి నిజంగానే బాబీ... విజయ్ కి స్టోరీ లైన్ వినిపించి ఓకే చేయించుకున్నాడా... అనేది మాత్రం ఈ సినిమాపై పూర్తి అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.