Advertisementt

మహేష్ అమెరికా వెళుతుంది అందుకే!

Wed 01st Nov 2017 01:06 AM
mahesh babu,bharath ane nenu,brand ambassador,thums up,usa  మహేష్ అమెరికా వెళుతుంది అందుకే!
Mahesh Babu Shoots for Thumbs Up ad in USA మహేష్ అమెరికా వెళుతుంది అందుకే!
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం తర్వాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. స్పైడర్ విడుదల తర్వాత కాస్త బ్రేక్ తీసుకున్న మహేష్ ఇప్పుడు భరత్ అనే నేను సినిమా కోసం శ్రమిస్తున్నాడు.  ఈ సినిమాతో పాటే వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించే సినిమా స్క్రిప్ట్ విషయం లోను మహేష్ బాగా కేర్ తీసుకుంటున్నాడు. ఇన్ని పనులతో బిజీగా ఉన్న మహేష్ ప్రస్తుతం  కొన్ని రోజుల పాటు ఈ పనులన్నింటికి బ్రేక్ ఇచ్చి వేరే షూటింగ్ లో పాల్గొంటాడట.

అయితే అది సినిమా షూటింగ్ కాదు....  జస్ట్ ఒక యాడ్ షూట్. మహేష్ బాబు ప్రముఖ కంపెనీ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తూ అందులో భాగంగానే మహేష్ థమ్స్ అప్ యాడ్ కోసం ఒక మూడు రోజులు కేటాయించనున్నాడు. మహేష్ బాబు ప్రముఖ కోలా బ్రాండ్ థమ్స్ అప్ కు ఇండియా తరపున గత కొన్నేళ్లుగా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సంగతి తెలిసిందే. థమ్స్ అప్ కి సంబంధించిన యాడ్ షూట్ కోసం మహేష్ ప్రస్తుతం యూఎస్ వెళ్లనున్నాడట. యూఎస్ లోని లాస్ వేగాస్ లో ఈ షూట్ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. 

అయితే సుమారు 3 రోజుల పాటు జరిగే ఈ షూట్ లో మహేష్ బాబు యాక్షన్ సీన్స్ లో పాల్గొనబోతున్నాడట. ఈ యాడ్ షూట్ కోసం మహేష్ బాబు నవంబర్ 7న యూఎస్ వెళ్లనున్నాడు. ఈ యాడ్ షూట్ పూర్తికాగానే మహేష్ యధావిధిగా కొరటాల శివ షూటింగ్ లో జాయిన్ అవుతాడట.

Mahesh Babu Shoots for Thumbs Up ad in USA:

Mahesh Babu is the brand ambassador for popular soft drink Thums Up

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ