మనం ఏదో పోర్న్‌స్టార్‌గా సన్నిలియోన్‌ను భావిస్తూ, ఇలాంటి వారు తమ పాత్రలతో, ఐటం సాంగ్స్‌తో, శృతిమించిన శృంగారంతో, హద్దులు లేని గ్లామర్ ఆరబోతతో మనల్ని, మన సంప్రదాయాలు, సంస్కృతులను కాలరాస్తూ, వేద భూమి అయిన మనదేశంలో విదేశీ సంస్కృతికి తెరదీస్తున్నారని తిడుతుంటాం. కానీ ఇక్కడి వారే సన్నిలియోన్‌ని మించిన అంగాంగ ప్రదర్శన చేయడాన్ని పట్టించుకోం. ఎంతైనా సన్నిలియోన్ పోర్న్‌స్టారే అయి ఉండవచ్చు. కానీ ఆమె ఎందరో అనాధపిల్లలని చేరదీస్తూ అందులో ఒకరిని ఏకంగా దత్తత తీసుకుని మానవత్వం చూపిస్తోంది. వృత్తిపరంగా ఆమె చేసేది పక్కనపెడితే తాను పోర్న్‌చిత్రాలలో నటించి తప్పు చేశానని, మన దేశం వచ్చిన తర్వాత ఇక్కడి సంప్రదాయాలను చూసి ఆనందపడుతూ సంతోషిస్తున్నానని చెప్పింది. తాను మంచి సందేశాత్మక చిత్రాలలో కూడా వైవిధ్యభరిత చిత్రాలు చేస్తానని చెప్పుకొచ్చింది. కానీ 'లోఫర్' భామ దిశాపటానీ వంటి వారు మాత్రం ఈ విషయంలో సన్నిని మించిపోతున్నారు.
'లోఫర్, ధోని' చిత్రాలలో నటించిన ఈ భామ సరైన అవకాశాలు రాకపోవడంతో రెచ్చిపోయింది. ఇక 'జాకీచాన్'తో 'కుంగ్‌ఫూయోగా'కూడా ఫ్లాపవ్వడంతో చైనాకి చెందిన ఓ టీవీ సిరీస్‌లో కూడా నటిస్తోంది. ఇక ఈమె తనకు మరింత గుర్తింపు, ఛాన్స్‌లు రావడం కోసం డబూరత్నాన్ని కాలెండర్ కోసం న్యూడ్‌గా కనిపించి ఉత్తరాదిని, బాలీవుడ్‌లనేకాదు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని కోసం టాప్‌లెస్ ఫోజులిచ్చింది. ఇక ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా, ప్రైవేట్ ఈవెంట్లలో కూడా రెచ్చిపోతోంది. ఈమధ్యే GQ మేగజైన్‌కి ఇచ్చిన ఫొటోలలో మరింతగా రెచ్చిపోయింది. ఈ ఫోటోలతో యువతనే కాదు.. కెమెరాలను కూడా తనవైపు తిప్పేలా చూసుకుంది. ఇలాంటి వాటి ద్వారా ఆమె అవకాశాల కోసం సినిమాలలో సైతం ఇలాగే అందాలను ఆరబోయడానికి రెడీ అని మేకర్స్‌కి హింట్ ఇస్తోంది.
మరీ ఛాన్స్‌ల కోసం ఇంత దిగజారాలా? అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. నా శరీరం నా ఇష్టం.. ఆడవారి దుస్తులనే ఎందుకు తప్పుపడతారు? అని ఎదురు ప్రశ్నలు వేస్తోంది. చలపతిరావు చెప్పినట్లుగా ఇలాంటి దుస్తులు, బిహేవియర్లే మహిళలపై ఉన్న గౌరవాన్ని పోగొడుతున్నాయి. ఇలాంటి డ్రస్‌లు వేసినప్పుడు ఒకటి తనను విమర్శించే వారిపై తిరగబడాలి.. లేదా మగాళ్లు చేసే కామెంట్స్‌నైనా భరించాలి.. ఈ రెండే ఈ తరహా మహిళలకు ఉన్న దారులని చెప్పవచ్చు.