హీరోయిన్ మమతా మోహన్‌దాస్ పేరు వింటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ', నాగార్జున 'కింగ్', వెంకటేష్ 'చింతకాయల రవి' వంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇక ఈమె కేవలం నటి మాత్రమే కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి. సింగర్‌గా, రచయితగా, సంగీతంపై బాగా అనుభవం ఉన్న కంపోజర్‌గా...ఇలా ఈమెలో ఎన్నో కోణాలున్నాయి. తెలుగులో స్టార్స్ చిత్రాలు చేస్తూ కెరీర్ పీక్‌స్టేజీలో ఉన్న సమయంలోనే ఆమె ఇండస్ట్రీకి దూరమైంది. క్యాన్సర్ మహమ్మారి ఆమె కెరీర్‌ను నాశనం చేసింది. ఎంతో కాలం క్యాన్సర్‌తో పోరాడిన ఆమె క్రికెటర్ యువరాజ్‌సింగ్, నటి గౌతమి తరహాలో మనోస్ధైర్యంతో గుండె నిబ్బరం చేసుకుని వైద్యం చేయించుకుంది. దీంతో ఆమె క్యాన్సర్‌ని సైతం జయించి, క్యాన్సర్ పట్ల ప్రజల్లో అవగాహన, ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడే మహిళల్లో చైతన్యం తీసుకొస్తోంది. తన సొంత డబ్బుతోపాటు విరాళాలు సేకరిస్తూ క్యాన్సర్ పీడితులైన పేద మహిళల చికిత్స కోసం ఆ డబ్బులను వెచ్చిస్తోంది.
కాగా ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత తన మాతృభాష మలయాళంలో చిత్రాలు చేస్తోంది. తాజాగా ఆమె మలయాళంలో 'కార్బన్' అనే చిత్రంలో నటిస్తోంది. ఇది ఓ ఫారెస్ట్ అడ్వంచర్ మూవీ. ఇందులో ఫాహద్ ఫాజిల్ హీరో. సాధారణంగా సామాన్యులు సినిమా వారు అదృష్టవంతులని, పాటలు, షూటింగ్‌ల కోసం అన్ని దేశాలు, సుందర ప్రదేశాలు తిరిగి వస్తారని, తిండి, దుస్తులు.. ఇలా ప్రతి విషయంలోనూ లగ్జరీ లైఫ్ గడుపుతారని భావిస్తూ ఉంటారు. అందులో వాస్తవం ఉన్నా కొన్ని చిత్రాల విషయంలో, యాక్షన్ సీన్స్ వంటి వాటిల్లో సినీనటీనటులు కూడ పలు ఇబ్బందులు రిస్క్‌లను చేయాల్సివుంటుంది. ప్రస్తుతం మమతా మోహన్ దాస్ అదే పని చేస్తోంది. 'కార్బన్' చిత్రం కోసం ఆమె అడవులు, అక్కడ ఉండే కొండలు, కోనలు, వాగులు, వంకలు వంటి వాటిని కాలినడకన చుట్టేస్తోంది.
ఎవరికైనా, ఎంతమంది తోడు ఉన్నా అడవులలోకి వెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. పురుగు పుట్ర, క్రూరజంతువులు, ఎత్తుపల్లాలు.. ఇలా అన్నింటినీ చుట్టి రావాల్సి ఉంటుంది. అది కూడా జాలీగా కాదు.. షూటింగ్ టెన్షన్‌లో ఉంటూనే అడవులను వెంట తిరగడం గ్రేట్. ప్రస్తుతం ఆమె అదే రిస్క్ చేస్తూ సెహభాష్ అనిపించుకుంటోంది. ప్రస్తుతం తెలుగులో సీనియర్ స్టార్స్‌కి హీరోయిన్ల కొరత ఉంది. మరి మన మేకర్స్‌కి ఈ విషయంలో మమతా కూడా ఓ బెస్ట్ చాయిస్ అనేచెప్పవచ్చు.