కెరీర్ స్టార్టింగ్‌లో తనకున్న మంచి బ్యాక్‌గ్రౌండ్‌తో హీరోగా కొన్ని చిత్రాలలో నటించాడు సపోర్టింగ్ యాక్టర్ శివబాలాజీ, హీరోలకు తమ్ముడి పాత్రలలో, అంతో ఇంతో ప్రాధాన్యం ఉన్న పాత్రలతో సర్దుకుపోతున్నాడు. కాగా ఈయన 'బిగ్‌బాస్' సీజన్1లో విజేతగా నిలిచి, 50లక్షల ప్రైజ్‌మనీతో పాటు బుల్లితెర వీక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. దాంతో మరలా ఆయన రాజీవ్ కనకాలతో కలిసి 'స్నేహమంటే ఇదేరా' అనే చిత్రంలో ఒక హీరోగా నటిస్తున్నాడు.
ఇక సినిమా వారంటే వారు ఏమీ చేయకపోయినా, వారి తప్పు లేకపోయినా కొన్ని సార్లు కొందరి దృష్టిలో విలన్లుగా మారుతారు. ఆయనకు ఎన్టీఆర్ అండ ఉందని అందువల్లే ఆయన బిగ్‌బాస్‌లో చాన్స్ కొట్టేసి విజేతగా నిలిచాడని కొందరు అంటున్నారు. మరికొందరేమో ఆయనకు పవన్‌కళ్యాణ్ అంటే భలే అభిమానమని, ఆయనతో 'అన్నవరం'లోనే కాదు 'కాటమరాయుడు'లో ఆయనకి తమ్ముడిగా నటించాడని, అసలు తన బర్త్‌డేలే జరుపుకునే అలవాటులేని పవన్ 'కాటమరాయుడు' సెట్లో శివబాలాజీ బర్త్‌డేను తానే స్వయంగా జరిపాడని, ఆ సమయంలో శివబాలాజీ సైతం పవన్‌కు స్పెషల్‌గా కత్తిని బహూకరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దాంతో పవన్ అభిమానుల ఓట్ల వల్లనే శివబాలాజీ బిగ్‌బాస్‌లో విజేతగా నిలిచాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ఈ అంశంలోనే శివబాలాజీకి తన తప్పు లేకపోయినా మరికొందరు హీరోల ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యాడని చెబుతారు.
తాజాగా ఆయన తనను ఏమీ అనలేని కొందరు.. తన భార్య మధుమితకి అసభ్యమెసేజ్‌లు పంపుతున్నారని పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈమధ్య కాలంలో యూట్యూబ్‌లలో నిరాధార ఆరోపణలు, నిందలు, అసభ్యకరమైన కామెంట్స్, అశ్లీల వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలను పెడుతున్నారని, తాను వీటిని గతంలోనే ఖండించడంతో తనను ఏమీ చేయలేక కొందరు కావాలని తన భార్యని టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నాడు. తనపై కక్ష్య కట్టిన వారే ఈ పని చేస్తున్నానరని చెప్పిన ఆయన తన విరోధులు ఎవరో మాత్రం చెప్పలేదు. త్వరలోనే పోలీసులు వారిని అరెస్ట్ చేస్తారనే నమ్మకం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు.