యావత్ తెలుగు ప్రజలు గర్వపడే మహానటుడు ఎన్టీఆర్. మరి అటువంటి నటుడిపై సినిమా తీయటం మాములు విషయం కాదు. నందమూరి బాలక్రిష్ణ తన తండ్రి ఎన్టీఆర్ గారి జీవితాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో దాదాపు స్క్రిప్టుకు సంబంధించిన పనులు జరుగుతున్నా ఈ చిత్రానికి ప్రస్తుతం నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది.
అయితే ఈ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రను బాలక్రిష్ణ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ తాజాగా నందమూరి అభిమానులు గర్వపడేలా ఓ న్యూస్ బయటికి వచ్చింది. అదేటంటే.. హరికృష్ణ పాత్రను నందమూరి కళ్యాణ్ రామ్ చేస్తునట్టు సమాచారం. ఈ వార్త నిజంగా నందమూరి అభిమానులకు శుభవార్తనే చెప్పాలి. మరి ఎప్పుడో... కళ్యాణ్ రామ్ చిన్నప్పుడు తన బాబాయ్ బాలకృష్ణ సినిమా బాల గోపాలుడు లో నటించాడు. మళ్ళీ ఇన్నాళ్లకు ఇప్పుడు మరోసారి తన బాబాయ్ తోపాటు ఎన్టీఆర్ బయోపిక్ లో నటించబోతున్నాడు కళ్యాణ్.
ఇకపోతే కథలో ముఖ్యమైన చంద్రబాబునాయుడు పాత్ర కోసం సీనియర్ నటుడు జగపతిబాబును అనుకుంటున్నారని తెలిసింది. అయితే ఈ విషయం ఇంకా అధికార ప్రకటన రావాల్సి వుంది. తేజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి మొదలుకానుంది. తెలుగు సినీ, రాజకీయ రంగాల్ని కొన్ని దశాబ్దాల పాటు శాసించిన ఎన్టీఆర్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం ఎలాంటి సంచనాలకు దారి తీస్తుందో చూడాలి.