Advertisementt

పవన్ ని ఫస్ట్ టైం చూసిన అను పరిస్థితి ఇది!

Mon 30th Oct 2017 06:55 PM
anu ammanuel,pawan kalyan,pspk25,jan 10  పవన్ ని ఫస్ట్ టైం చూసిన అను పరిస్థితి ఇది!
Anu Emmanuel Interesting Comments on Pawan పవన్ ని ఫస్ట్ టైం చూసిన అను పరిస్థితి ఇది!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ లో అను ఇమాన్యువల్ గురించిన టాపిక్ ఎక్కువైంది. ఇండస్ట్రీలో నటించిన రెండు సినిమాలతోనే పవన్ పక్కన ఛాన్స్ కొట్టేసి ఆహా అనిపించిన అను ఇమ్మాన్యువల్ నటించిన 'ఆక్సిజెన్' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆమెకు 'ఆక్సిజెన్' మొదటి సినిమానే అయినప్పటికీ ఆ సినిమా పోస్ట్ పోన్ మీద పోన్ అవుతూ ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్దమయ్యింది. అయితే ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అను పలు ఇంటర్వ్యూలతో బిజీగా వుంది. ఇకపోతే త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్  కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కీర్తి సురేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న అను ఇమ్మాన్యువల్... పవన్ కళ్యాణ్ పక్కన నటించడం అదృష్టం అంటూ గతంలోనే తెలిపింది.

తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సరసన నటించడం అదృష్టంగా భావిస్తున్నానంటూ.... పవన్ తో మొదటి రోజు కలిసి నటించినప్పుడు కాస్త భయమేసిందని చెబుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో మొదటి రొమాంటిక్ సీన్ తనపైనే షూట్ చేశారని... అయన పక్కన డైలాగ్ చెప్పేటప్పుడు పర్ఫెక్ట్ గా ఉండాలని... ఒకటికి మూడుసార్లు చదువుకున్న డైలాగ్స్ కూడా పవన్ కళ్యాణ్ ముఖం చూడగానే కంగారులో ఆ డైలాగ్ మరిచిపోయే దాన్నని, PSPK 25 కి సంబందించిన తన అనుభవాల్ని చెబుతుంది అను ఇమ్మాన్యువల్.

ఇక ప్రస్తుతం యూరప్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఖుష్బూ, ఇంద్రజ, ఆది పినిశెట్టి మొదలగు వారు నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

Anu Emmanuel Interesting Comments on Pawan :

Anu Ammanuel Experience at PSPK25 sets 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ