Advertisement

రజనీని అందుకోవడం ఎవరివల్లా కాదంతే!

Mon 30th Oct 2017 11:01 AM
latha rajinikanth,super star rajinikanth,2.0 movie  రజనీని అందుకోవడం ఎవరివల్లా కాదంతే!
Latha Rajinikanth Praises Super Star Rajinikanth రజనీని అందుకోవడం ఎవరివల్లా కాదంతే!
Advertisement

మన తెలుగు హీరోలకు పరభాషల్లో ఎంత క్రేజ్‌ ఉందో తెలియదు గానీ రజనీకాంత్‌కి మాత్రం దేశవ్యాప్తంగానే కాదు..జపాన్‌, మలేషియా, దుబాయ్‌ వంటి చోట్ల కూడా ఎంతో క్రేజ్‌ ఉంది. ఇక తెలుగులో ఆయన ఇక్కడి స్టార్‌ హీరోలకు ఉన్న ఇమేజ్‌ని సాధించాడు. ముఖ్యంగా 'భాషా' తర్వాత ఆయన రేంజే మారిపోయింది. ఆయన స్టైల్‌ని, ఎనర్జీలెవల్స్‌ని చూసి మంత్రముగ్దులు కాని వారు ఉండరు. ఇక రజనీ తెలుగులో కూడా తెరపై కనిపిస్తే మన స్టార్స్‌కి వచ్చినట్లుగా చప్పట్లు, ఈలలు మారుమోగిపోతాయి. 'పెదరాయుడు' చిత్రంలో ఆయన చేసిన గెస్ట్‌ పాత్ర ఆ చిత్రం బ్లాక్‌బస్టర్‌ కావడానికి దోహదపడింది.

ఇక '2.0' కోసం కూడా తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవిదేశాలలో ఎదురుచూస్తున్నారు. ఇక ఆయన పాత్రలకు మనో చెప్పే డబ్బింగ్‌ కూడా ఎంతో హెల్ప్‌ చేస్తుంది. అందుకే ఆయన డబ్బింగ్‌ జరిగేటప్పుడు డబ్బింగ్‌ థియేటర్‌కి వెళ్లి మరీ ప్రతి చిత్రంలో మనోని ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇక  '2.0'లో ఆయన చూపిన అంకిత భావం, కఠోరశ్రమ, అనారోగ్యంలో కూడా ఆయన కమిట్‌మెంట్‌ని చూసి ఆయన భార్య లతా రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌, శంకర్‌ వంటి వారు ఆశ్యర్యపోయారట. ఢిల్లీలో 40 ప్లస్‌ డిగ్రీల వేడిమిలో, 12 కేజీల సూట్‌ వేసుకుని, ఆయన్ను ఓ పెట్టేలో బంధించి పూడ్చేసీన్‌ కోసం నాలుగు గంటలు కదలకుండా రజనీ ఉండిపోయారట. దీంతో ఎప్పుడు పెద్దగా మాట్లాడని ఆయన భార్య సైతం రజనీని ఆకాశానికి ఎత్తేసింది. 

ఇక ఈచిత్రం ఆడియో వేడుకలో హిందీ తరపున కరణ్‌జోహార్‌, తమిళ్‌ తరపున ఆర్జేబాలాజీ, తెలుగు తరపున రానా హోస్ట్‌గా వ్యవహరించారు. ఇక తెలుగులోహోస్ట్‌ చేసిన రానా రజనీని తెలుగులో ఒక డైలాగ్‌ చెప్పమని అడిగితే ఆయనకు బాగా ఇష్టమైన 'భాషా' చిత్రంలోని 'నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే' అనే డైలాగ్‌ చెప్పడంతో ఆ ప్రాంతం చప్పట్లు, విజిల్స్‌తో అదిరిపోయింది. ఇక ఈ వేడుకలో రజనీకి చెందిన కుటుంబ సభ్యులైన భార్య లత, అల్లుడు ధనుష్‌, కూతుర్లు ఐశ్వర్య, సౌందర్యలు కూడా పాల్గొన్నారు. 

Latha Rajinikanth Praises Super Star Rajinikanth:

No One Can Beats Super Star Rajinikanth 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement