దీపం వున్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి. ఈ సామెత కరెక్టుగా మన హీరోయిన్స్ కి సూట్ అవుతుంది. తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి..... తాజాగా ఆమె నటించిన సినిమాలు ఏమి హిట్ అవ్వడంలేదు కానీ.. అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. లేటెస్ట్ గా ఆమె నటించిన 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమా రిలీజ్ అయిందనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం లావణ్య పై కోలీవుడ్ లో ఒక న్యూస్ హల్చల్ చేస్తుంది.
విషయం ఏంటంటే.. తెలుగు లో సూపర్ హిట్ అయిన '100 % లవ్' చిత్రాన్ని.. తమిళ్ లో '100% కాదల్' అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరో. మొదట ఈ సినిమా కోసం హీరోయిన్‌గా లావణ్య త్రిపాఠిని తీసుకున్నారు. అయితే అంతా ఓకే అయిన తర్వాత ఈ సినిమాలో నేను చేయడం లేదంటూ లావణ్య సంచలన ప్రకటన చేసి సినిమా నుండి బయటకు వచ్చేసింది. హఠాత్తుగా తీసుకున్న ఈ నిర్ణయంతో చిత్ర బృందం షాక్ అయ్యింది. ఇక ఆఖరికి లావణ్య ప్లేస్ లో 'అర్జున్ రెడ్డి' హీరోయిన్ షాలినిను తీసుకుని షూటింగ్ స్టార్ట్ చేసారు.
అయితే సడెన్‌గా సినిమా నుండి తప్పుకోవడంతో చిత్ర నిర్మాతలు లావణ్య త్రిపాఠిపై నిర్మాతల మండలిలో కంప్లయింట్ చేశారంట. ఆమె వల్ల 3 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని.. వెంటనే ఆ డబ్బు ఇచ్చేయాలని నిర్మాతల మండలి తరుపు నుండి డిమాండ్ చేశారంట. ఆ డబ్బు ఇచ్చేవరకు ఆమెకు కోలీవుడ్‌లో నిషేధం విధించాలనే నిర్ణయం కూడా తీసుకున్నారని సమాచారం. దీనిపై హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి. అసలే చేతిలో అవకాశాలు లేక ఇదవుతున్న సమయంలో ఇలా మూడు కోట్ల నష్టపరిహారం అంటే మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లేగా..!