అనసూయ మళ్లీ పిచ్చెక్కించింది..!

Anasuya Photos Viral In Social Media

అనసూయ యాంకర్ గా బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చినప్పటి నుండే గ్లామర్ షోకి తెర తీసింది. ఆమె యాంకర్ గా అడుగెట్టాకే యాంకర్స్ అందరూ కాస్తో కూస్తో గ్లామర్ షోకి సిద్ధమయ్యారు, అంతకుముందు చుడి దార్లు, శారీస్, ఓణీలతో కనబడిన వారంతా అనసూయ పుణ్యమా అని అందాల ఆరబోతకు దిగారు. అనసూయ పెళ్లి చేసుకుని పిల్లలను కన్నప్పటికీ ఆమె గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. అప్పటినుండి ఇప్పటికి ఒకటే ఫిజిక్ ని మెయింటింగ్ చేస్తూ హీరోయిన్స్ కి సైతం పోటీ ఇచ్చే స్టేజి కి వచ్చేసింది. వెండితెర మీద హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేద్దామనుకున్న ఈ భామకి అక్కడ అది వర్కౌట్ అవ్వలేదు. అందుకే కేరెక్టర్ ఆర్టిస్ట్ గా సేల్ అవడానికి ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది.

అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో ఇరగదీస్తోంది. గతంలో కాస్త బొద్దుగా ఉన్న అనసూయ ఇప్పుడు చాల స్లిమ్ లుక్ లో నాజూగ్గా తయారైంది. ఈ టీవీలో జబర్దస్త్ స్టేజ్ మీద కత్తిలాంటి డ్రెస్సులతో ప్రేక్షకులను ఉర్రుతలూగిస్తున్న అనసూయ.... ఆంటీ అయినప్పటికీ కుర్రాళ్ల గుండెల్లో మాత్రం వీణలు మీటుతూనే ఉంది. తాను చేసే ఈవెంట్స్ కి వెళ్లే ముందు కొన్ని ఫొటోస్ ని ప్రత్యేకంగా తీయించుకుని వాటిని తన సోషల్ మీడియా పేజీ లో పోస్ట్ చేస్తుంటుంది. ఇక ఆఫొటోలకు కావాల్సిన లైక్ లు కామెంట్స్ పడుతుంటాయి అది వేరే విషయం.

ఇక ఇప్పుడు కూడా తాజాగా అనసూయ ఒక కత్తిలాంటి ఫొటోస్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఆ ఫొటోస్ లో అనసూయ మరి చిన్న అమ్మాయిలా... అదిరిపోయే ఫిజిక్ తో హీరోయిన్స్ కి పోటీగా కనబడుతుంది. మరి అనసూయకైతే అదే ఉద్దేశ్యం ఉంది. తాను హీరోయిన్ అవ్వాలని.. మరి ఈ ఫొటోస్ చూసి అయినా ఆమెకి గ్లామర్ రోల్స్ ఎమన్నా ఇస్తే బావుంటుంది. దర్శక నిర్మాతలు అనసూయ గురించి ఓసారి ఆలోచిస్తే బావుంటుంది.

Anasuya Latest Photoshoot Sensation in Social Media

anasuya
social media
anasuya photoshoot