Advertisementt

'నక్షత్రం'పై సందీప్ సెన్సేషనల్ కామెంట్స్!

Sun 29th Oct 2017 07:28 PM
sundeep kishan,nakshatram,sensational comments,krishna vamsi  'నక్షత్రం'పై సందీప్ సెన్సేషనల్ కామెంట్స్!
Sundeep Kishan Sensational Comments on Nakshatram 'నక్షత్రం'పై సందీప్ సెన్సేషనల్ కామెంట్స్!
Advertisement
Ads by CJ

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా కెరీర్ మొదలుపెట్టినప్పటి నుండి మంచి కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో సందీప్ వరుస ప్లాపులతో ఇబ్బందులు పడుతున్నాడు. తాజాగా సందీప్ నుండి వచ్చిన 'నక్షత్రం' అనే సినిమా సందీప్ కెరీర్ కి పెద్ద దెబ్బ వేసిందనే చెప్పుకోవచ్చు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక్కసారైనా నటించాలని తపించే హీరోల్లో ఒకడిగా సందీప్ కూడా ఆయనతో పని చేసే అవకాశం వచ్చినందుకు చాలా ఎగ్జైట్ గా ఫీలయ్యాడు. అయితే సందీప్ కి  ఈ అవకాశం రాంగ్ టైమింగ్ లో వచ్చింది అని గ్రహించలేకపోయాడు. దర్శకుడిగా పూర్తిగా ఫామ్ కోల్పోయిన కృష్ణవంశీ 'నక్షత్రం' సినిమా తెరకెక్కించి... భారీ డిజాస్టర్ అందుకున్నాడు.

ఈ సినిమాలో అనేకమంది నటీనటుల్ని తీసుకుని సినిమా మొత్తం గజిబిజి చేసేశాడు కృష్ణవంశీ. అలాంటి డిజాస్టర్ సినిమా తీసి సందీప్ కిషన్ కెరీర్ ను మరింత దెబ్బ తీశాడు కృష్ణవంశీ. ఆ సినిమా విడుదలై చాలా కాలం అయ్యింది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సందీప్ కిషన్ 'నక్షత్రం' సినిమా గురించి నోరు విప్పాడు. ఆ ఇంటర్వ్యూ లో సందీప్ మాట్లాడుతూ 'నక్షత్రం' తేడా కొడుతుందని తనకు ముందే తెలిసిపోయినట్లుగా కామెంట్స్ చేశాడు సందీప్. అసలు ఈ సినిమా ట్రైలరే తనకు ఏ మాత్రం నచ్చలేదని సందీప్ ఈ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. 

అయితే ఆ ట్రైలర్ నచ్చలేదని విషయాన్ని కృష్ణవంశీకి చెబితే ఆయన తనని తిట్టాడని చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు ఈ 'నక్షత్రం' సినిమా కోసం ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా చాలా ప్రమాదకర యాక్షన్ సీక్వెన్స్ చేశాను కానీ...... దర్శకనిర్మాతలు ఈ సినిమాని తప్పు దోవ పట్టించారు అని చెబుతున్నాడు. పాపం నిజంగానే సందీప్ కి ఈ సినిమాతో కోలుకోలేని ఎదురుదెబ్బ తగలడమే కాక తన అప్ కమింగ్ సినిమాల మీద ఆ సినిమా ప్రభావం చాలా పడిందనేది మాత్రం వాస్తవమే.

Sundeep Kishan Sensational Comments on Nakshatram:

Sundeep Krishna Controversy Comments on Krishna Vamsi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ