Advertisementt

నాని కుటుంబం ఎంత పెద్దదో తెలుసా?

Sun 29th Oct 2017 05:47 PM
nani,2 million twitter followers,natural star  నాని కుటుంబం ఎంత పెద్దదో తెలుసా?
Nani's Natural Record on Twitter నాని కుటుంబం ఎంత పెద్దదో తెలుసా?
Advertisement
Ads by CJ

ప్రస్తుతం అదృష్టం అంటే అది ఏస్థాయిలో ఉంటుందో నేచురల్‌ స్టార్‌ నానిని చూస్తే అర్ధమవుతుంది. ఆయనకు అదృష్టం.. దురదృష్టం పట్టినట్లుగా పట్టింది. ఎక్కడ కాలు పెడితే అక్కడ విజయమే. ఒకటి రెండు చిత్రాలు హిట్స్‌ కావడమే ఇతర హీరోలకు గగనమైపోతున్న రోజుల్లో నాని డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించాడు. ఇక ఆయన 'నేను..లోకల్‌' తర్వాత మరోసారి దిల్‌రాజు బేనర్‌లో వేణుశ్రీరాం దర్శకత్వంలో 'ఎంసీఏ' చిత్రం చేస్తున్నాడు. 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి'గా కనిపించనున్న నాని పక్కన 'ఫిదా' బ్యూటీ సాయిపల్లవి కూడా నటిస్తుండటంతో ఈ జంటను చూడాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఆయన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో 'కృష్ణార్జున యుద్దం'లో ద్విపాత్రాభినయం చేయనున్నాడు. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఆ తర్వాత నాగార్జునతో కలసి శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో మల్టీస్టారర్‌తో పాటు రెండు మూడేళ్లకు సరిపడా సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. 

మినిమం గ్యారంటీ స్టార్‌ నుంచి హిట్‌ గ్యారంటీ స్టార్‌ అనే స్థాయికి ఆయన స్వయంకృషితో ఎదిగాడు. ఇక సినిమా సినిమాకి ఆయన తన అభిమానులను కూడా సంపాదిస్తూ, తనకంటూ ఓ రేంజ్‌, క్రేజ్‌, ఇమేజ్‌ తెచ్చుకుంటున్నాడు. ఆయన చేస్తున్న చిత్రాలను మాస్‌, క్లాస్‌, ఫ్యామిలీ, యూత్‌ ఇలా అన్ని వర్గాలకు నచ్చేలా చేస్తున్నాడు. ఇక ఆయనకు పెరుగుతున్న ఫ్యాన్స్‌కి ఉదాహరణగా ఆయన ట్విట్టర్‌ ఫాలోయర్స్‌ సంఖ్యను చెప్పవచ్చు. ఆయన ట్విట్టర్‌ ఖాతా 20లక్షలకు చేరింది. ఇక ఆయనకు ఫేస్‌బుక్‌లో 46లక్షల మంది ఫాలోయర్స్‌ ఉన్నారు.

తన ట్విట్టర్‌ ఖాతా ఫాలోయర్స్‌ 20లక్షలకు చేరడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశాడు. తన ఫ్యామిలీ పెద్దదైందని, రెండు మిలియన్లకు చేరుకుందని ట్వీట్‌చేశాడు. 'నా ఉమ్మడి కుటుంబం' అనే హ్యాష్‌ట్యాగ్‌ని కూడా జతచేశారు. భవిష్యత్తులో మరింత పెద్ద స్టార్‌గా మారడానికి ఆయన కథల ఎంపిక నుంచి అన్ని విషయాలలో ఎంతో శ్రద్ద తీసుకుంటున్నాడు. మొత్తానికి నాని ఇప్పుడు సినిమాలోనే కాదు.. సోషల్‌మీడియాలో కూడా హల్‌చల్‌ చేస్తున్నాడు. 

Nani's Natural Record on Twitter:

Nani Gets 2 Million Twitter Followers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ