యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్ కెరీర్‌ని చూస్తే 'బాహుబలి' ముందు తర్వాత అని విభజించుకోవాలి. ఈ చిత్రంతో ప్రభాస్ నేషనల్‌స్టార్‌గా మారి, అన్నివుడ్‌లకి ఐకాన్‌గా మారాడు. దాంతో ఆయన తదుపరి చిత్రం 'సాహో'పై కూడా దేశవ్యాప్తంగా, అన్ని భాషల్లో వారు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇండియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్స్‌లో ఆయన కూడా ఒకడు అయిపోయాడు. గత వారంలోనే ఆయన తన 38వ పుట్టినరోజును సింపుల్‌గా జరుపుకున్నాడు. కానీ అభిమానులు మాత్రం తామే ఘనంగా జరిపారు. ఇదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని ఓ సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అలహాబాద్ నగర పోలీస్ విభాగంలో క్రైమ్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారిణి ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను దూందాంగా నిర్వహించి, అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ, ప్రభాస్ నా లైఫ్. నేను కష్టాలలో బాధల్లో ఉన్నప్పుడు ఆయన చిత్రాలను చూసి సాంత్వన పొందుతాను. స్క్రీన్‌పై ఆయన్ను చూస్తే అన్ని మర్చిపోతాను. తెరపై ఆయన్ను చూస్తేనే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. అతనే నాకు ప్రేరణ. నా విషెష్, అభిమానం ప్రభాస్‌కి చేరాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. మరి ఆమె గురించి ప్రభాస్ దాకా చేరిందో లేదో కానీ కొన్ని అనుమానాలైతే కొందరికి ఉన్నాయి. ప్రభాస్ నటించిన 'బాహుబలి-ది బిగినింగ్', 'బాహుబలి-ది కన్‌క్లూజన్' ఈ రెండు పార్ట్‌లే ఉత్తరాదిన థియేటర్లలో విడుదల అయ్యాయి. అయినా ఆమె ఆయన సినిమాలను స్క్రీన్‌పై చూసి ప్రేరణ పొందుతానని చెప్పింది.
పదుల సంఖ్యలో ఇంకా చెప్పాలంటే ఎన్నోచిత్రాలను ఆమె స్క్రీన్‌మీద చూసినట్లుగా చెబుతోంది. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటిస్తేనే గానీ అంత పాపులర్ మాటలను ఆమె స్పష్టంగా చెప్పలేదు. ఇక ప్రభాస్ నటించిన అనేక చిత్రాలు హిందీ ఛానెల్స్‌లో, యూట్యూబ్ వంటి స్క్రీన్లలో ఆమె చూసిందా? లేక ఆయన నటించి థియేటర్లలో విడుదలైన రెండు పార్ట్‌లను చూసే ఆమె అంత అభిమానం పెంచుకుందా? అనే అనుమానం రాకమానదు. అయినా మన తెలుగు హీరోకి దేశంలో ఇలాంటి అభిమానులే ఉంటే అది గర్వించాల్సిన విషయమే. మరి ఆమె మాటలు నిజమా? పబ్లిసిటీ పొందే ప్రయత్నమా ? అనేది ఆమెకు, ఆ దేవుడికే తెలియాలి.