మహేష్ విలన్ ఆ హీరోనా? నమ్మమంటారా?

'స్పైడర్' సినిమా అనుకున్న విజయం సాధించకపోవడంతో మహేష్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న 'భరత్ అనే నేను' మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాలో మహేష్ సీఎం గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా మొత్తం పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే మహేష్... వంశీ పైడిపల్లి సినిమా లో నటించబోతున్నాడు. ఈ సినిమాకి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా అనుకుంటున్నారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి దేవి శ్రీ ప్రసాద్ తో వంశీ మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చున్నాడు.
ఇది ఇలా ఉండగా వంశి - మహేష్ సినిమాలోలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు అని రూమర్ ఒకటి బయటికి వచ్చింది. అల్లరి నరేష్... మహేష్ సినిమాలో నటిస్తున్నాడు అనే విషయం పాత విషయమే అయినప్పటికీ .. ఈ సినిమాలో అల్లరి నరేష్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. అదెంటంటే అల్లరి నరేశ్ ఈ మహేష్ - వంశీ కలయికలో వస్తున్న సినిమాలో విలన్ గా నటిస్తునాడు అని.
ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో నరేష్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. నేను మహేష్ తో నటిస్తున్నానని.. చెప్పాడు... కానీ ఏ పాత్రో చెప్పలేదు. ప్రస్తుతం ఈ రూమర్ ఫిల్మ్ నగర్ లో హల్‌చల్ చేస్తుంది. హీరోగా ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉండటం వల్లే అల్లరి నరేష్ ఈ రోల్ ని ఓకే చేశాడు అని తెలుస్తుంది. ఇదివరకు 'విశాఖ ఎక్స్‌ప్రెస్' అనే సినిమాలో అల్లరి నరేశ్ నెగేటివ్ రోల్ లో నటించి మెప్పించాడు. మరి ఈ రూమర్ నిజమో కాదో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే. లేదా అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.
Allaresh Naresh Villain in Mahesh Movie, Joke or Real?
Allari Naresh Villain In Mahesh and Vamsi Paidipalli Movie




































