Advertisementt

మహేష్ విలన్ ఆ హీరోనా? నమ్మమంటారా?

Sat 28th Oct 2017 11:36 PM
allari naresh,mahesh babu,vamsi paidipalli,naresh role,joke or real  మహేష్ విలన్ ఆ హీరోనా? నమ్మమంటారా?
Allari Naresh Villain In Mahesh and Vamsi Paidipalli Movie మహేష్ విలన్ ఆ హీరోనా? నమ్మమంటారా?
Advertisement
Ads by CJ

'స్పైడర్' సినిమా అనుకున్న విజయం సాధించకపోవడంతో మహేష్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న 'భరత్ అనే నేను'  మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమాలో మహేష్ సీఎం గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా మొత్తం పొలిటికల్ బ్యాగ్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా పూర్తి కాగానే మహేష్... వంశీ పైడిపల్లి సినిమా లో నటించబోతున్నాడు. ఈ సినిమాకి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా అనుకుంటున్నారు చిత్ర బృందం. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి దేవి శ్రీ ప్రసాద్ తో వంశీ మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చున్నాడు.

ఇది ఇలా ఉండగా వంశి - మహేష్ సినిమాలోలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు అని రూమర్ ఒకటి బయటికి వచ్చింది. అల్లరి నరేష్... మహేష్ సినిమాలో నటిస్తున్నాడు అనే విషయం పాత విషయమే అయినప్పటికీ .. ఈ సినిమాలో అల్లరి నరేష్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. అదెంటంటే అల్లరి నరేశ్ ఈ మహేష్ - వంశీ కలయికలో వస్తున్న సినిమాలో విలన్ గా నటిస్తునాడు అని.

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో నరేష్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు.  నేను మహేష్ తో నటిస్తున్నానని.. చెప్పాడు... కానీ ఏ పాత్రో చెప్పలేదు. ప్రస్తుతం ఈ రూమర్ ఫిల్మ్ నగర్ లో హల్‌చల్ చేస్తుంది. హీరోగా ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉండటం వల్లే అల్లరి నరేష్ ఈ రోల్ ని ఓకే చేశాడు అని తెలుస్తుంది. ఇదివరకు 'విశాఖ ఎక్స్‌ప్రెస్' అనే సినిమాలో అల్లరి నరేశ్ నెగేటివ్ రోల్ లో నటించి మెప్పించాడు. మరి ఈ రూమర్ నిజమో కాదో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే. లేదా అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.

Allari Naresh Villain In Mahesh and Vamsi Paidipalli Movie :

Allaresh Naresh Villain in Mahesh Movie, Joke or Real?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ