Advertisementt

బాలయ్య భోంచేస్తుంటే వీడియో తీశారు!

Fri 27th Oct 2017 12:27 AM
balakrishna,simplycity,paisa vasool  బాలయ్య  భోంచేస్తుంటే వీడియో తీశారు!
Balayya Simplicity Revealed బాలయ్య భోంచేస్తుంటే వీడియో తీశారు!
Advertisement
Ads by CJ

అభిమానులపై చేయి చేసుకుంటాడనే అప్రదిష్ట ఉన్నప్పటికీ నందమూరి అభిమానులు మాత్రం బాలయ్యని మించిన మంచి వాడు, డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ స్టార్‌ లేడని వాదిస్తుంటారు. తమను కొట్టినా సరే అది తమకు ఆనందం అంటూ ఉంటారు. ఇక పూరీజగన్నాథ్‌ చెప్పినట్లు ఆయన అభిమానులను కొట్టాడంటే అది ప్రేమకు చిహ్నం. బాలయ్య అభిమానులు ఆయన చేతి దెబ్బ తింటే అంతకంటే అదృష్టం లేదని భావిస్తారు. ఆయన కొడితే తన్నులు తిన్నవారికి అదృష్టం కూడా కలిసి వస్తుందని అంటుంటారు. వీటి సంగతి పక్కన పెడితే నిజంగానే బాలయ్య బయటకు వచ్చినప్పుడు కూడా బౌన్సర్స్‌గా ఎవ్వరినీ పెట్టుకోడు. ఎందుకంటే ఇతర హీరోల విషయంలో హీరోల కంటే వారి బౌన్సర్స్‌గా  పనిచేసే వారే ఎక్కువగా ఓవర్‌యాక్షన్‌ చేస్తూ మ్యాన్‌ హ్యాండిలింగ్‌ చేస్తూ ఉంటారు. వారి స్థానంలో బాలయ్యే తన ప్రేమ అయినా, కోపమైనా చూపిస్తాడనేది వాస్తవమే. 

ఇక సినిమాలలో తప్ప ఆయన బయట కూడా చాలా సింపుల్‌గా కనిపిస్తూ ఉంటాడు. ఆమధ్య 'పైసావసూల్‌' భామతో డిన్నర్‌కి వెళ్లి ఆ ఫోటోలను ఆమె పోస్ట్‌ చేయడంతో అందరు  ఆశ్యర్యపోయారు. అయినా ఆయన ఎలాంటి హంగామా లేకుండా డిన్నర్‌ చేసి వచ్చాడు. ఇప్పుడు తాజాగా అలాంటిదే మరో వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియాలో ఓ హోటల్‌కి వెళ్లిన బాలయ్య తానే ఒంటరిగా ఉండి భోజనం చేస్తున్న సన్నివేశాలున్నాయి. అలా ఆహారం తీసుకుంటున్న సమయంలో బాలయ్య పక్కన ఎవ్వరూ లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

సాధారణంగా స్టార్స్‌ అంటే హంగు ఆర్బాటాలు, వెనక ముందు పది మందితో కలిసి కనిపిస్తూ ఉంటారు. దీంతో బాలయ్య తన స్టార్‌డమ్‌ని కూడా లెక్కచేయడని, చాలా సింపుల్‌గా ఉంటాడని కితాబునిస్తున్నారు. అయితే ఆ రెస్టారెంట్‌ ఎక్కడ, బాలయ్య అక్కడ భోజనం చేసింది ఎప్పుడు? ఆ వీడియో ఎవరు తీశారు? అనే వివరాలు మాత్రం తెలియడం లేదు. ఇక 'పైసావసూల్‌' షూటింగ్‌ విదేశాలలో జరుగుతున్నప్పుడు కూడా బాలయ్య నేలపై గడ్డిలో పండుకుని నిద్ర పోతున్న ఫోటో కూడా ఆయన గొప్పతనానికి నిదర్శనంగా నందమూరి అభిమానులు ఆనందంతో చెబుతున్నారు.

Balayya Simplicity Revealed :

Balayya Simplycity vidio Hulchul in Social Media

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ