'దేవదాస్' చిత్రంతో ఇండస్ట్రీకి ఎంటరైన రామ్ మంచి ఎనర్జిటిక్ హీరోగా నిరూపించుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌తో పాటు తనదైన డైలాగ్ డెలివరి, యాక్షన్ సీన్స్, స్టెప్స్..ఇలా అన్నింటిలో ఓకే అనిపించుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన చిత్రాలు 14 అయితే అందులో కేవలం 5 చిత్రాలు మాత్రమే ఆడాయి. ఈ పర్సెంటేజ్ చాలా బ్యాడ్ అని రామ్ స్వయంగా ఒప్పుకున్నాడు. ఇక నితిన్‌కి తన తండ్రి సుధాకర్‌రెడ్డి ఉన్నట్లే రామ్‌కి వాళ్ల పెదనాన్న స్రవంతి రవికిషోర్ ఉన్నాడు. వరుసగా చిత్రాలు ఫ్లాప్‌లయినా మరలా నితిన్ ఎలాగైతే 'ఇష్క్'తో హిట్ కొట్టి ట్రాక్‌లోకి వచ్చాడో రామ్ కూడా వరుస పరాజయాల తర్వాత 'నేను...శైలజ'తో హిట్ కొట్టాడు. ఆ తర్వాత మరలా తనదైన మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి 'హైపర్'తో షాక్‌తిన్నాడు. దీంతో తన మొదటి చిత్రంతోనే తనకు 'నేను...శైలజ' వంటి హిట్‌ని అందించిన కిషోర్ తిరుమలతోనే దేవిశ్రీప్రసాద్, తన పెదనాన్న స్రవంతి రవికిషోర్‌లతో 'ఉన్నది ఒకటే జిందగీ' చేశాడు. అక్టోబర్ 27 న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్రం స్నేహం, ప్రేమ అనే వాటిపై ఆధారపడిన సింపుల్ ఎమోషనల్ స్టోరిగా, అందరికీ కనెక్ట్ అయ్యేలా చిత్రం ఉంటుందని రామ్ చెబుతున్నాడు. ఇక చిన్నతనం, కాలేజీ స్టూడెంట్ ఏజ్, మెచ్యూరిటీ వయసులలో వచ్చే సంఘటనలతో ఈ చిత్రం నిండి ఉంటుందని, ఇందులో ఐటం సాంగ్స్ ఉండవని, మాస్ కమర్షియల్ టైప్ చిత్రం కాదని, హ్యూమన్ ఎమోషన్స్‌తో నిండిన చిత్రంగా దీనిని చెప్పుకొచ్చాడు. నేటి కాన్సెప్ట్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్ బాగా ఆడుతుండటం ఈ చిత్రానికి ప్లస్ అనే చెప్పాలి. ఇందులో అభిరామ్ పాత్రలో తాను నటిస్తున్నానని, తన క్లోజ్ ఫ్రెండ్ వాసు పాత్ర అని, వీరిద్దరి మద్యకు ఎవరొచ్చారు? తర్వాత జరిగిన పరిణామాలేమిటి? అనేదే చిత్ర కథాంశం. ఈ చిత్రం చూసే వారికి మనకి కూడా నాలాంటి అభిరామ్ అనే ఫ్రెండ్ ఉంటే బాగుంటుందని ప్రేక్షకులు ఫీలవుతారట.
ఇక ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉండటంతో ఇది కూడా ఎమోషన్స్‌తో నిండిన లవ్‌స్టోరీ అని అర్దమవుతోంది. ఈ చిత్రం సందర్భంగా నా క్లోజ్‌ఫ్రెండ్ శరత్ గుర్తొచ్చాడు. ప్రీప్రొడక్షన్‌లో అతనితో నాకు ఉన్న స్నేహం గుర్తుకొచ్చింది. వాటిల్లో బాగా ఎమోషనల్ అనిపించిన సీన్స్‌ని డైరెక్టర్ కిషోర్ తిరుమలతో పంచుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇక తాను ఏదైనా కథ వినేటప్పుడు ఓపెన్‌మైండ్‌తో వెళ్తానని, స్టోరీ నెరేషన్ వినేటప్పుడు సీన్స్ ఊహించుకుంటానని, తాను బాగా ఎగ్జైట్ అయితేనే సినిమా ఒప్పుకుంటానని చెప్పుకొచ్చాడు. మరి అలాంటి వ్యక్తికి ఇన్ని ఫ్లాప్‌లెలా వచ్చాయి? అనేది ఆశ్యర్యకరం.