ఈమధ్య కాలంలో అందునా సోషల్‌మీడియా వచ్చిన తర్వాత ఏచిత్రం పోస్టర్ రిలీజ్ అయినా, టీజర్, ట్రైలర్స్‌లోని దృశ్యాలు, బీజీఎంలు వేరే భాషలవి వాడుకున్నా కూడా నెటిజన్లు వెంటనే స్పందిస్తున్నారు. ఇక ఒక హీరో పోస్టర్, సినిమా కథలు వంటి విషయాలలోయాంటీ ఫ్యాన్స్ రుజువులతోసహా అది కొరియన్ చిత్రానికా, హాలీవుడ్ చిత్రానికా, లేక చైనీస్ చిత్రానికి కాపీనా అనేది క్షణాల్లో కనిపెట్టేస్తున్నారు. నాటి 'బాహుబలి' పోస్టర్స్‌లో ఏనుగు తొండంపైకి ఎక్కిన ప్రభాస్ లుక్ కూడా కాపీనేనని తేల్చేశారు.
ఇక తాజాగా విడుదలైన ప్రభాస్ తాజాచిత్రం 'సాహో' ఫస్ట్‌లుక్‌ని కూడా ఆధారాలతో సహా ఇది హాలీవుడ్ మూవీ అయిన 'బ్లేడ్‌రన్నర్ 2049' సిరీస్‌లోని పోస్టర్‌కి కాపీ అని 'బ్లేడ్‌రన్నర్' పోస్టర్‌ని, 'సాహో' ఫస్ట్‌లుక్‌ని పక్క పక్కన పెట్టేయడంతో చివరకు ప్రభాస్ అభిమానులు కూడా కాదని చెప్పలేక డిఫెన్స్‌లో పడిపోయి ఫస్ట్‌లుక్ కాపీ అయినా కూడా ఆ లుక్‌లో ప్రభాస్ అదిరిపోయాడని అంటున్నారు. ఆకాశాన్ని తాకే భవంతులు ఉన్న ఈ బిగ్ సిటీ స్ట్రీట్‌లో ప్రభాస్ ఫుల్ లెంగ్త్ జాకెట్ ధరించి, ముఖానికి మాస్క్ వేసుకుని, నడుస్తున్నట్లు కనిపిస్తున్నాడు.
మరో విషయం ఏమిటంటే.. ఇది కూడా సినిమాలోని సన్నివేశాలలో తీసిన ఫోటో కాదని కేవలం ఫొటోషాప్‌తో సృష్టించిన స్టిల్ అనికూడా అంటున్నారు.మరి 'బాహుబలి' తర్వాత ప్రభాస్ ఏదో ఇరగదీసే చిత్రం చేస్తాడని భావించిన వారు 'సాహో'పై ఎన్నోనమ్మకాలు పెట్టుకుని ఉన్నారు. ఫస్ట్‌లుక్ విషయంలో జరిగిందేదో జరిగింది.. మరి సినిమా స్టోరీ అయినా కొత్తగా ఉంటుందా? లేక రెగ్యులర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా హాలీవుడ్, ఇతర భాషల్లోని చిత్రాలలోని సన్నివేశాలను తీసుకుని, అంతా వాటితోనే నింపేస్తారా? అనే అనుమానం కలుగుతోంది.