Advertisementt

త్రివిక్రమ్ తారుమారు చేశాడు!

Wed 25th Oct 2017 01:01 AM
trivikram srinivas,ntr,pawan kalyan,mahesh babu,bharath ane nenu  త్రివిక్రమ్ తారుమారు చేశాడు!
Trivikram Confused Hero and Directors Combinations త్రివిక్రమ్ తారుమారు చేశాడు!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో ఒకే ఒక డైరెక్టర్ వల్ల ప్రస్తుతం అనుకున్న కాంబినేషన్స్ మొత్తం తారుమారయ్యాయి. ఆయనెవరో కాదు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. అదేమిటి త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్ సినిమా చేసుకుంటూ ఎన్టీఆర్ సినిమాని కూడా లాంచ్ చేశాడనుకుంటున్నారా. అక్కడికే వస్తున్నాం.... త్రివిక్రమ్, పవన్ కోసం ఎదురు చూసి చూసి ఎలాగో పవన్ తో సినిమా సెట్ చేసుకున్నాడు. ఇక పవన్ సినిమా కంప్లీట్ కాకుండానే ఎన్టీఆర్ సినిమాకి ఒకే చెప్పడమే కాదు... సినిమాని లాంఛనంగా మొదలెట్టేసాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా మొదలెట్టినా కూడా ప్రస్తుతం మార్చ్ వరకు సెట్స్ మీదకెళ్లే ఛాన్స్ లేదంటున్నారు. మరి ఈ లోపు ఎన్టీఆర్ ఖాళీగా కూర్చోవాలి. మరి ఇప్పుడు ఖాళీగా ఉండి తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చెయ్యడం వలన కొరటాల సినిమాని ఎన్టీఆర్ వదులుకోవాల్సి వస్తుంది.

త్రివిక్రమ్ తర్వాత ఎన్టీఆర్... కొరటాలకు కమిట్ అవుదామనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ కోసం ఎదురు చూడలేని కొరటాల మహేష్ 'భరత్ అనే నేను' సినిమా తర్వాత రామ్ చరణ్ కి కమిట్ అయ్యాడు. కానీ 'రంగస్థలం' డిసెంబర్ లో పూర్తవడంతో చరణ్... కొరటాల కోసం చూడకుండా బోయపాటి సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాతే కొరటాలతో సినిమా అంటున్నాడు చరణ్. మరి ఒకే ఒక్క త్రివిక్రమ్ వలన మొత్తం కాంబినేషన్స్ తారుమారయ్యాయి. 

అయితే త్రివిక్రమ్ వలన స్టార్ హీరోల కాంబినేషన్స్ మారిపోయినా.. త్రివిక్రమ్ మాత్రం ఎంచక్కా.. పవన్ తర్వాత ఎన్టీఆర్... ఆ తర్వాత మహేష్ సినిమా ఇలా కూల్ గా సినిమాలు చేసుకుంటూ పోతాడు. మహేష్ 'భరత్ అనే నేను' తర్వాత.. వంశి పైడిపల్లి తో సినిమా పూర్తవగానే త్రివిక్రమ్ తో సినిమా చేస్తాడనే టాక్ ఉంది. ఇక ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం నాలుగైదు నెలలు ఖాళీగా ఉండి త్రివిక్రమ్ సినిమా పూర్తి చేసి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అవుతున్నాడనే ప్రచారం ఉంది. సో... ఒక్క దర్శకుడు... ఒకే ఒక్క దర్శకుడి వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట.

Trivikram Confused Hero and Directors Combinations:

Trivikram Movie with NTR, Confused NTR Directors

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ