ప్రభాస్ తన పెదనాన్న రెబెల్‌స్టార్ కృష్ణంరాజుకి, నిర్మాతగా తన తండ్రికి వారసునిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. ఇక అతి కొద్ది కాలం పాటు ఆయన కెరీర్ ప్రారంభంలో ఇబ్బందులు పడినా కూడా రాజమౌళి 'ఛత్రపతి'తో తనదైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక ఆయన ఐదేళ్ల అహర్నిశల కృషికి ప్రతిఫలంగా ఆయనకు మరలా రాజమౌళినే 'బాహుబలి' చిత్రంతో నేషనల్‌స్టార్ గుర్తింపుని తెచ్చి ఇచ్చాడు. ఇందులో ప్రభాస్ అంకితభావం కూడా మెచ్చుకోదగిన విషయం. నిజానికి ప్రభాస్‌కి పార్టీ కల్చర్ లేదు. కానీ మీడియా మిత్రులకు మాత్రం తన బర్త్‌డే రోజున ట్రీట్ ఇవ్వడం ఆయనకు అలవాటు. కానీ ప్రభాస్ 'బాహుబలి' చిత్రంతో బిజీ అయిన తర్వాత ఈ చిత్రం విడుదల తర్వాత నువ్వు ఖచ్చితంగా నేషనల్‌స్టార్‌వి అవుతావని చెప్పిన సన్నిహితులు, మిత్రులు ఈసారైనా బర్త్ డే పార్టీని చేసుకుని మమ్మల్ని పిలవాలని గట్టి పట్టు పట్టారట. దాంతో ఈ ఏడాది మాత్రం ఆయన తనక్లోజ్ సర్కిల్‌కి గ్రాండ్‌గా పార్టీ ఇచ్చాడని సమాచారం.
అక్టోబర్ 23 తో ఆయన 38వ ఒడిలోకి అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన పెదనాన్న కృష్ణంరాజు.. ప్రభాస్ గురించి మాట్లాడుతూ, ప్రభాస్ నా వారసుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. ప్రభాస్ గురించి మూడే మాటలు చెబుతాను. ఆయన అంకిత భావంతో పనిచేసే ఆర్టిస్ట్. తన సుఖం గురించి ఆలోచించని వ్యక్తి. సినిమాకి సంబంధించిన కథలను అందరు హీరోలు వింటారు. ఆలా కథలు విన్న తర్వాత అవి బాగున్నాయో? లేదో జడ్జ్ చేయడం చిన్న విషయం కాదు. అలా జడ్జ్ చేయడంలో ప్రభాస్ పర్‌ఫెక్ట్. ఒక కథను వింటే దానిని ఏ స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఎలా తీసుకెళ్లవచ్చనేది ప్రభాస్ ఈజీగా క్యాచ్ చేస్తాడు. ఇక వ్యక్తిగత విషయానికి వస్తే మన మద్యలేని మూడో వ్యక్తి గురించి ఆయన మాట్లాడడు. అలాంటి లేని వ్యక్తి గురించి మాట్లాడే గుణం ఆయనలో లేదు.. అని చెప్పుకొచ్చాడు.
సామాన్యంగా కృష్ణంరాజు.. ప్రభాస్‌ని ఎక్కువగా పొగడడు. 'బాహుబలి' చిత్రం రెండు పార్ట్‌లు విడుదలైనప్పుడు కూడా కృష్ణంరాజు యూనిట్‌లోని అందరిని పొగిడాడే గానీ ప్రభాస్ గురించి ఒక్క మాట మాట్లాడటం గానీ పొగడటం మాత్రం చేయలేదు. నిజంగానే కృష్ణంరాజు చెప్పిన అన్ని క్వాలిటీస్ ప్రభాస్‌లో ఉన్నాయని అందరూ ముక్తకంఠంతో ఒప్పుకుంటారు. ఈ సుగుణాలన్ని ఉండబట్టే ఐదేళ్ల పాటు 'బాహుబలి'ని జడ్జి చేసి, దానిని ఇంకో లెవల్‌కి తీసుకుళ్లి, తన అంకిత భావాన్ని చేతల్లో చూపించాడు. అందుకే ఆయన అతి తక్కువ చిత్రాలతోనే నేషనల్‌స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని యంగ్ రెబెల్‌స్టార్ నుంచి రెబెల్‌స్టార్‌గా ఎదిగాడు.