ఎప్పుడు పాతొక రోత... కొత్తక వింత అనే పద్దతి కూడా సరికాదు. పాతవారిలో మంచి వారు ఉండవచ్చు. కొత్తవారిలో చెడువారు ఉండవచ్చు. ఈ విషయంలో పవన్ పెద్ద తప్పటగులు వేస్తున్నాడు. ఆయన నమ్ముకున్న వారి వల్ల ఆయన పరువు గంగపాలవుతోంది. ఇప్పటికే బండ్లగణేష్, శరత్‌మరార్ వంటి వారు పవన్‌కి చెడ్డపేరు తెచ్చారు. ఒకప్పుడు చిరంజీవి ఫ్యాన్స్‌కి నేతగా, ఐబ్యాంక్, బ్లడ్ బ్యాంకు వ్యవహారాలలో మెగాస్టార్ చిరంజీవి నమ్మినబంటుగా చెప్పుకునే ఓ వ్యక్తి కూడా ఇలాంటి పనులే చేశాడు. తద్వారా చిరంజీవి రాజకీయంగా అడుగు పెట్టకముందే ఇలాంటి రౌడీయిజమా అనే నిందలు పడాల్సి వచ్చింది. తాజాగా పవన్ మం చిఉద్దేశ్యాలతో 'జనసేన'ను స్థాపించి, యువతను రాత పరీక్షలు, ఇతర పద్దతుల ద్వారా ఎంచుకుంటున్నప్పటికీ పవన్ పేరు చెప్పి ఆయన అభిమానులు చేసే ఆగడాలు, ఆయన మా కులం వాడు అంటూ పవన్‌కి లేని కులపు రంగును అభిమానులు పవన్‌కి అంటిస్తున్నారు. దాంతో ఆయన నాకు కులం లేదన్నా కూడా ఆయనకు ఆ మట్టి అంటుకుంటోంది.
ఇక కత్తి మహేష్‌ని చంపేస్తామని థ్రెట్ ఇవ్వడంతో పాటు ఆయన అభిమానులు ఆయనపై విమర్శ వస్తే చాలు చంపుతాం.. నరుకుతాం అని అనడం చూస్తే భయం వేయకమానదు. అభిమానులు కొన్నిసార్లు ఎంత బలమవుతారో.. కొన్నిసార్లు అంత మైనస్ కూడా అవుతారు. తాజాగా పవన్ 'జనసేన' పార్టీకి అధికార ప్రతినిధి, పవన్ అభిమాన సంఘం నాయకుడు కళ్యాన్ దిలీప్ సుంకరను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓఎల్‌ఎక్స్‌లో ఐఫోన్ 7ని అమ్మకానికి పెట్టిన ఈయన కొనుగోలు దారుని మాత్రం డూప్లికేట్ వస్తువును ఇచ్చాడు. ఇదేమని అడిగితే పవన్ బలం చూసుకుని రెచ్చిపోయి ఎయిర్‌గన్‌తో బెదిరించాడు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన ఉంచి ఎండీవర్‌కారును, ఎండీవర్ గన్‌ని స్వాధీనం చేసుకున్నారు. దేవుడు తప్పులేకపోయినా పూజారుల అవినీతి వల్ల దేవాలయాలంటేనే ప్రజలు విరక్తి పెంచుకున్నట్లుగా ఇలాంటి చీటింగ్ రాయుళ్ల వల్ల ప్రతిపక్షాలకు అస్త్రశస్త్రాలనే కాదు.. మంచి విమర్శలకు అవకాశాలిస్తున్నారు. ఇప్పటికేనా పవన్ ఇంటి దొంగలను, భజన పరులను పక్కనపెట్టపోతే పవన్‌కే నష్టం.